Trisha | Pawan Kalyan | Gabbar Singh 2

Trisha again pair up with pawan kalyan

Trisha again pair up with Pawan, Trisha again pair up with Pawan Kalyan, Trisha in Gabbar singh2, Trisha latest news, Trisha movie news, Trisha movie updates, Trisha hot stills, Trisha latest stills, Trisha spicy stills, Trisha tamil stills, Trisha, Pawan kalyan latest news, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan

Trisha again pair up with Pawan Kalyan: As per latest news....Tamil star actress Trisha again pair up with Power star pawan kalyan in Gabbar singh2.

తీన్ మార్ భామతో గబ్బర్ సింగ్ రొమాన్స్

Posted: 04/08/2015 04:58 PM IST
Trisha again pair up with pawan kalyan

‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా ఏమిటా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తు వున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి సీక్వెల్ గా ‘గబ్బర్ సింగ్2’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా వుంది. కానీ పవన్ ఇంకా ఈ ప్రాజెక్టు కోసం సిద్ధమవడం లేదు.

అలాగే అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తానని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై పవన్ ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టు మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లడం లేదు.

ఇదిలా వుంటే ‘గబ్బర్ సింగ్2’ సినిమాలో హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ ను ఎంపిక చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవలే ‘గోపాల గోపాల’ సినిమాలో ఓ న్యూస్ రీడర్ పాత్రలో కనిపించింది. నటిగా మంచి మార్కులే పడ్డా... పవన్ పక్కన హీరోయిన్ గా సరిపోదేమో అనే వార్తలొచ్చాయి. దీంతో ఈ అమ్మడిని మరో స్టార్ హీరోయిన్ తో రీప్లేస్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. పవన్, త్రిషల కాంబినేషన్లో ఇప్పటికే ‘తీన్ మార్’ చిత్రం వచ్చింది. పవన్ ఇందులో మైఖేల్ గా నటించగా... మీరా పాత్రలో త్రిష నటించింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ సాధించకపోయినా... మంచి విజయం సాధించింది. పైగా వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా బాగుండటంతో... ‘గబ్బర్ సింగ్2’లో త్రిష అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు పూర్తయ్యాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక మరియు లొకేషన్ల ఫైనలైజ్ జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Trisha  Gabbar singh2  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more