Trisha in special chabbis south remake film

Trisha in Special Chabbis South Remake, Trisha in Special Chabbis Remake, Special Chabbis Remake, Trisha in special chabbis, Remake, Trisha For special chabbis Remake, Trisha in chabbis Remake, Trisha latest news, Trisha movie news, Trisha Remake news, Trisha remake details, Trisha latest updates, Trisha movie updates, Trisha, special chabbis

Trisha in Special Chabbis South Remake Film: Special 26 movie going to remake in south industry. telugu, tamil, malayalam and kannada. Tyagarajan producer.

నలుగురు హీరోలతో త్రిష స్పెషల్ రొమాన్స్

Posted: 03/07/2015 03:26 PM IST
Trisha in special chabbis south remake film

ఒక్క ప్రాజెక్టుతో సౌత్ లోని నాలుగు ఇండస్ట్రీలలో ఒకేసారి హిట్ కొట్టడానికి సిద్ధమయ్యింది బ్యూటీఫుల్ హీరోయిన్ త్రిష. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, కాజల్ జంటగా నటించిన ‘స్పెషల్ 26’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను దక్షిణాదిలో రీమేక్ చేయబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ చిత్ర సౌత్ రీమేక్ హక్కులను ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను దక్షిణాదిలోని నాలుగు భాషలలో రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ ను నాలుగు భాషలలో నలుగురు హీరోలతో నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా వివరాలను త్యాగరాజన్ ఇటివలే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని నాలుగు భాషలలో ఒకేసారి రీమేక్ చేయనున్నారని, తెలుగులో రవితేజ, తమిళంలో ప్రశాంత్, కన్నడంలో దర్శన్, మలయాళంలో దిలీప్ లు నటించనున్నారని త్యాగరాజన్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ హీరోలతో చర్చలు జరుపుతున్నామని, మరికొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హిందీలో మనోజ్‌భాజ్‌పాయ్, అనుపమ్‌ఖేర్‌లు పోషించిన పాత్రలను తమిళంలో ప్రకాష్‌రాజ్, సత్యరాజ్ పోషించనున్నట్లుగా, అలాగే వీరితో పాటు నాజర్, షియాజి షిండే, ఎంఎస్ భాస్కర్, రావు రమేష్, బ్రహ్మాజి, హేమ, తులసి తదితరులు నటించనున్నారని త్యాగరాజన్ వెల్లడించారు.

అలాగే వీరిపక్కన నటించబోయే హీరోయిన్ గా దక్షిణాదిలోని ప్రముఖ నటిని ఎంపిక చేయనున్నట్లుగా తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నాలుగు భాషలలో రూపొందనున్న ఈ చిత్రాల్లో త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలిసింది. ఎందుకంటే త్రిషకు తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మంచి క్రేజ్ వుంది. అందుకే త్రిష అయితేనే ఈ పాత్రకు సరిపోతుందని త్యాగరాజన్ భావిస్తున్నట్లుగా కోలీవుడ్ వర్గాల సమాచారం.

త్వరలోనే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదేమైనా ఈ నాలుగు సినిమాలలో నటించబోయే హీరోయిన్ ఎవరో కానీ... ఒక్క సినిమాతో నాలుగు ఇండస్ట్రీలలో తన పేరు మారిమ్రోగిపోవడం ఖాయం. ఈ సినిమాతో పాటుగా త్యాగరాజన్ బాలీవుడ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘క్వీన్’ సౌత్ హక్కులను కూడా ఎప్పుడో దక్కించుకున్నారు. ఈ రీమేక్ లో కూడా ముందుగా త్రిషనే అనుకున్నారు. కానీ ఈ రీమేక్ లో నటించడానికి త్రిష సున్నితంగా నో చెప్పేసింది. కానీ ఆ రీమేక్ ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేదు. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Special Chabbis  South Remake  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more