Ar rahman music director hero surya vikram kumar movie updates

ar rahman news, ar rahman movies, ar rahman photos, ar rahman musics, ar rahman albums, ar rahman music albums, director vikram kumar, hero surya movie, hero surya telugu movie, vikram kumar surya movie

ar rahman music director hero surya vikram kumar movie updates : AR rahman impressed with the story of director vikram kumar's in which tamil hero surya playing in lead role.

ఇంప్రెస్ అయిన రెహ్మాన్.. ఫిక్సయ్యాడట!

Posted: 02/10/2015 12:09 PM IST
Ar rahman music director hero surya vikram kumar movie updates

మ్యూజిక్ డైరెక్టర్’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ గురించి తెలియనివారు ఎవరుండరు. ప్రపంచవ్యాప్తంగా వున్న గొప్ప మ్యూజిక్ డైరెక్టర్’లలో ఒకడైన రెహమాన్.. ఆస్కార్ అవార్డునూ అందుకున్న విషయం తెలిసిందే! అటువంటి మ్యూజిక్ కంపోజర్ ఏదైనా ఒక మూవీకి  తన బాణీలు స్వరపరుస్తున్నాడంటే.. అదే ఆ మూవీకి పెద్ద హైప్ తెచ్చిపెడుతుంది. చిన్నాపెద్దా అని తేడాలను పక్కనపెడితే.. రెహమాన్ మ్యూజిక్ అంటే ఆ చిత్రానికి పెద్ద క్రేజ్ వచ్చిపడుతుంది. అందుకే.. ఇతనితో తమ మూవీకి స్వరాలు సమకూర్చుకుంటే తమ చిత్రానికి పెద్ద క్రేజ్ వస్తుందన్న నమ్మకంతో స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు ఈయన వెంటపడుతుంటారు.

పైగా.. రెహమాన్ ఏదైనా ఓ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడంటే మాటలు కాదు. ఎందుకంటే.. ఆయనకి సినిమా కథ, యూనిట్ నచ్చితేనే మ్యూజిక్ అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇందుకు భారీ పారితోషికాన్నే ఆయనకు ముట్టజేయాల్సి వుంటుంది కానీ.. అది వేరే విషయం! మొత్తానికి ఇక్కడ చెప్పదలచుకున్నదేమిటంటే.. ఏవిధంగా అయితే ఓ స్టార్ హీరో పలానా చిత్రం చేస్తున్నాడని ఎలా చెప్పుకుంటారో.. అదేవిధంగా ఈయన ఓ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడంటే సదరు మూవీ గురించి ప్రచారాలు జోరుగా సాగుతాయి. ఏదైతేనేం.. ఈయన ఏదైనా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడంటే.. ఆ మూవీకి ఇంకా రిలీజ్ కాకముందే భారీగా క్రేజ్ వచ్చిపడుతుంది. ఇంతకు ఈ తతంగమంతా ఎందుకు చెప్పుకుంటున్నామనేగా సందేహం! అది తెలియాలంటే.. మేటర్’లోకి వెళ్లాల్సిందే!

‘మనం’ ఫేం విక్రంకుమార్ దర్శకత్వంలో సూర్యా హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్లు అందరికీ తెలిసిందే! ఈ చిత్రాన్ని స్వయంగా హీరో సూర్యానే నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్’గా ఏఆర్ రెహమాన్ అయితేనే బాగుంటుందని భావించిన దర్శకనిర్మాతలు.. ఆయన్ను ఒప్పించేందుకు కాస్త కసరత్తు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే.. మూవీ కథ నచ్చితేనే రెహ్మాన్ చేస్తాడన్న విషయాన్ని తెలుసుకున్న దర్శకుడు.. తన దగ్గరున్న స్ర్కిప్ట్’తో ఆయన్ను ఇంప్రెస్ చేయడానికి దాదాపు మూడుగంటలపాటు కష్టపడ్డాడు. అంటే.. ఆ మూవీ కథను వివరంగా వినిపించాడన్నమాట! అలా కథ విన్న తర్వాత దానికి ఇంప్రెస్ అయిన రెహ్మాన్.. వెంటనే తాను మ్యూజిక్ అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం!

అంతేకాదు.. అప్పుడే ఆ మూవీ కోసం ఓ బాణీ కూడా కట్టేశాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తమ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ పెద్ద ఎసెట్ అవుతుందని, ఈ చిత్రానికి తగ్గట్టు మెలోడియస్, డీసెంట్ పాటలను రెహ్మాన్ సమకూరుస్తారనే ఉద్దేశంతో ఆయన్ను ఒప్పంచించాల్సి వచ్చిందని చిత్రబృందం పేర్కొంటోంది. దీంతో ఈ మూవీ ఇప్పుడు రెహ్మాన్ మ్యూజిక్’తో టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ar rahman latest news  vikram kumar surya movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh