Megastar chiranjeevi kerala spa treatment 150 movie plan

chiranjeevi news, chiranjeevi kerala spa, chiranjeevi kerala treatment, chiranjeevi 150 movie, ram charan tej, ram charan tej latest news, chiranjeevi movie news, vv vinayak chiru movie, vv vinayak movie news, ram charan tej latest movies, paruchuri brothers

megastar chiranjeevi kerala spa treatment 150 movie plan : According to tollywood sources.. megastar chiranjeevi has taking ayurveda treatment to reduce his weight and look smart for his 150 movie.

కేరళలో చిరు స్పా థెరపీ..!!

Posted: 02/02/2015 03:45 PM IST
Megastar chiranjeevi kerala spa treatment 150 movie plan

మెగాస్టార్ చిరంజీవి గతకొన్నాళ్ల నుంచి కేరళలోనే వుంటున్నారు. పైగా.. అక్కడ కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోనూ ఈయన నిమగ్నమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ అవేంటనీ ఆరా తీస్తే.. చిరు అక్కడ ‘స్పా’ థెరపీ తీసుకుంటున్నారని అంటున్నారు. తన 150వ చిత్రం కోసం చిరు కాస్త స్టైలిష్’గా, యంగ్ హీరోలకు ధీటుగా వుండేలా బాడీని బిల్డప్ చేసుకోవడానికి చిరు కేరళలో ప్రత్యేక వైద్యం చేయించుకుంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమాల నుంచి దూరమై రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం చిరంజీవి తన ఫిజిక్’పై అంతగా దృష్టి సారించలేకపోయారు. తద్వారా ఈయన విపరీతంగా బరువు పెరిగిపోయారు. ఇప్పుడు తన బరువును తగ్గించుకోవడం కోసమే ఆయన కేరళకు వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. అలాగే స్టైలిష్ లుక్’ని పొందడం కోసం ఆయన అక్కడి స్పాలో డైటింగులతో కూడిన ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే యోగా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారట!

ఇక పనిలో పనిగా ఈ 150వ సినిమాకి రచన చేస్తున్న పరచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ కూడా చిరుతోనే కేరళలో వుండి.. ఆయనతో కథాచర్చలు జరుపుతున్నారట! చిరు రీఎంట్రీకి తగ్గ కథను సమకూర్చేందుకే ఆయన దగ్గరుండి కథను విశ్లేషిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. అంటే.. కేరళ నుంచి తిరిగి రాగానే చిరు కొత్త లుక్’తో కనిపించడంతోపాటు తన 150వ చిత్ర వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇదిలావుండగా.. చిరు 150వ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడిగా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం విదితమే! ఫ్యామిలీ ప్రేక్షకులకు తగినట్లుగా కామెడీ, ఎంటర్టైన్ మెంట్’తోపాటు మెసేజ్ అందించే కథను సమకూరుస్తున్నారని ఇండస్ట్రీ టాక్! అటు.. చిరు తన మూవీ గురించి ఎప్పుడో వెల్లడిస్తారోనని అభిమానులతోపాటు టాలీవుడ్ మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi 150 movie  chiru kerala spa  ram charan tej  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more