Sundara pandyan telugu remake with raviteja

ravi teja in sundara pandyan telugu remake, sundara pandian telugu remake, ravi teja kick 2 movie updates, kick2 movie latest photos, ravi teja upcoming movies, special 26 telugu remake update, tollywood latest news updates

sundara pandyan telugu remake with raviteja : ravi teja have busy schedule for next one year, ravi teja now acting kick2 movie after that he had scheduled for sampath nandi bengal tiger movie, after nandi project mass hero have special 26 and also sundara pandian tamil remake has to choose which one is first

రాసిపెట్టి ఉంటే ఎప్పటికైనా రాక తప్పదు

Posted: 12/08/2014 11:49 AM IST
Sundara pandyan telugu remake with raviteja

మనకంటూ రాసి పెట్టి ఉంటే ఎప్పటికైనా అది మన దరికే చేరుతుందని పెద్దలు అంటుంటారు. చాలా విషయాల్లో ఇది జరుగుతుంది. తాజాగా మాస్ మహారాజా విషయంలోనూ ఇదే జరిగింది. గతంలో రవి దగ్గరకు వచ్చిన ఓ  సినిమా ఆఫర్ మరొ హీరో దగ్గరకు వెళ్లింది. మళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి రవి బెస్ట్ చాయిస్ అంటూ వచ్చి వెయిట్ చేస్తోంది. తమిళంలో రెండు సంవత్సరాల క్రితం వచ్చిన‘సుందర్ పాండియన్’ సినిమా హక్కులను భీమినేని శ్రీనివాసరావు తీసుకున్నారు.

ఈ మూవీలో నటించాలంటూ రవితేజను భీమినేని సంప్రదించగా..., వర్కవుట్ కాలేదు. సరేలే అనుకుని సునీల్ దగ్గరకు వెళ్ళారు. అక్కడ కూడా పని కాలేదు. ఆ తర్వాత పలువురు హీరోలను పరిశీలించారు. కానీ రవికంటే ఎవరూ బాగా చేయలేరని.., తిరిగి ఆయన వద్దకే కధ తీసుకుని మరోసారి వెళ్ళారట. తాజా అప్ డేట్ ప్రకారం.., రవి తేజ లిస్ట్ లో ఉన్న ఈ సినిమా ఆయన ఓకే చెప్తే ఫైనలైజ్ అవుతుందని అంటున్నారు. మాస్ మహారాజా ఒప్పుకుంటాడా లేక మళ్ళీ బయటకు పంపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బిజీ హీరోల్లో రవితేజ ఒకరు. వరుసగా సినిమాలు చేయటమే కాకుండా.., భవిష్యత్తులో కూడా రెండు ప్రాజెక్టులు చేతుల్లో ఉంచుకుని మరో ఏడాది వరకు బిజీగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కిక్2’లో నటిస్తున్న రవితేజ ఈ మూవీ తర్వాత సంపత్ నంది చెప్పిన ‘బెంగాల్ టైగర్’లో నటించనున్నారు. ఆ తర్వాత ‘స్పెషల్ 26’కూడా రవి కోసం వెయిట్ చేస్తోంది. ఈ లోపు ఆఫర్లు ఇస్తున్న సినిమాలు కూడా ఖరారు అయ్యే అవకాశముంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more