Ramyakrishna ambala movie remuneration

ramyakrishna ambala movie remuneration, ramyakrishna in ambala movie, ramyakrishna remuneration latest news, ramyakrishna latest updats, ramyakrishna krishna vamshi divorce marriage issues, ramyakrishna latest movies, ambala movie updates, ambala movie shooting photos, ambala movie cast and crew, hansika photos in ambala movie, vishal in ambala movie, koliwood latest news updates

ramyakrishna ambala movie remuneration : koliwood shocked with hearing ramyakrishna ambala movie remuneration amount. senior actress ramya krishna takes 3laks for each call sheets for ambala movie

చింత చచ్చినా పులుపు చావలేదు

Posted: 12/02/2014 11:27 AM IST
Ramyakrishna ambala movie remuneration

ఒకప్పుడు హాట్ హీరోయిన్లు ప్రస్తుతం చాలావరకు తెరకు దూరం కాగా కొందరు ఇప్పటికీ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. వయసు మీద పడుతున్నా.., కొత్త వయ్యారాలు పోతూ క్రేజ్ కొనసాగిస్తున్నారు. క్రేజ్ ను ఇన్వెస్ట్ మెంట్ గా పెట్టి.., భారీ రెమ్యునరేషన్లు వసూలు చేస్తున్నారు. ఈ ట్రిక్ ను తూ.చ. తప్పకుండా ఫాలో అవుతున్న రమ్యకృష్ణ అనుకున్నది సాధించిందని టాక్ విన్పిస్తోంది. తమిళంలో తెరకెక్కే ‘అంబాలా’ సినిమాలో రమ్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం రెమ్యునరేషన్ గా రూ.90లక్షలు తీసుకుంటోందట.

ఒక్కో కాల్షీటుకు రూ.3లక్షల లెక్కన 30 కాల్షీట్లను సినిమాకు కేటాయించిందట. ఈ విషయం తెలిసిన కోలీవుడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ‘అంబాలా’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న హన్సికకే ఇంకా సరిగా కోటి రూపాయలు ఇచ్చినట్లు టాక్ లేదు. అలాంటిది తల్లి క్యారెక్టర్ కు ఇంత ముట్టజెప్పటం అవసరమా అనుకుంటున్నారు. అయితే నిర్మాతలు కుష్భూ, విశాల్ గట్టిగా ఉండటంతో అడిగినంత కట్టబెట్టేందుకు ఓకే చెప్పారట. తల్లికి, పిల్లకు ఒకే రేటు కట్టిన నిర్మాతలు ఇద్దర్నీ ఎలా వాడుకుంటారో అని కోలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘యముడికి మెగుడు’ సినిమాలో అత్తగా నటించిన రమ్యకృష్ణ అల్లరి నరేష్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ కు చిందేసింది. ఇలాంటిదే ఈ మూవీలో ఉంటుందట.

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉండటంతో ఇక్కడ కూడా సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు పీరియాడికల్ మూవీ ‘బాహుబలి’లో రాజమాతగా రమ్యకృష్ణ నటిస్తోంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రమ్యకృష్ణకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇండస్ర్టీకి వచ్చి ఇన్నేళ్ళయినా ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటిగా క్రేజ్ అలా కొనసాగుతోంది. అదృష్టం ఇలా పట్టుకుని ఉంటే ఎవరు కాదనగలరు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ambala movie  ramyakrishna  remuneration  vishal  hansika  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more