Samantha ruth prabhu says twitter sorry memu saitham programme cricket match event escaped

samantha ruth prabhu, samantha latest news, samantha hot photos, samantha memu saitham, samantha latest photo gallery, samantha comedy scenes, samantha hot scenes, samantha mahesh babu, samantha trivikram srinivas, samantha latest photo shoot

samantha ruth prabhu says twitter sorry memu saitham programme cricket match event escaped

బుంగమూతి భామకు బుద్ధొచ్చినట్లుంది..!

Posted: 12/01/2014 07:12 PM IST
Samantha ruth prabhu says twitter sorry memu saitham programme cricket match event escaped

కోపం వచ్చినప్పుడల్లా బుంగమూతి పెట్టుకుని సైడయిపోయే గ్లామర్ డాల్ సమంతకు బుద్ది వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే.. ఈసారి కాస్త వినయంగా ప్రవర్తించి మంచి మార్కులే కొట్టేసింది. ట్విటర్’లో అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్లు చేసి టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచిపోయే ఈ సెక్సీ భామ.. ఆ సోషల్ మీడియానే వేదికగా తీసుకుని ‘సారీ’ చెప్పింది. దీంతో ఈమెపై ఇంతవరకు ఆగ్రహంగా వున్న అభిమానులు ఒక్కసారిగా చల్లారినట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. ఆదివారం (30-11-2014) నాడు జరిగిన ‘మేము సైతం’ కార్యక్రమంలో ఈ చెన్నై ముద్దుగుమ్మ మొదట్లో బాగానే సందడి చేసింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కలసి స్కిట్ చేసి, తన చిలిపితనాన్ని బయటపెట్టేసుకుంది. ఇందులో భాగంగానే ఆ అమ్మడు ఇద్దర్నీ తమాషా ప్రశ్నలు అడుగుతూ కొన్ని మంచి జవాబులను రాబట్టి అందరినీ ఆకట్టుకుంది. ఆ మొత్తం కార్యక్రమంలో వీళ్ల స్కిట్ హైలైట్’గా నిలిచిపోయింది. ఆ దెబ్బతో సమంతపై మరింత అభిమానం పెరిగింది. కానీ సమంత ఆ అభిమానాన్ని ఎక్కువసేపు నిలబెట్టుకోలేకపోయింది.

నిజానికి ఆ కార్యక్రమం తర్వాత సమంత క్రికెట్ మ్యాచ్ లో కూడా ఆడాల్సివుంది. అయితే వారిద్దరితో స్కిట్ చేసిన అనంతరం ఈ అమ్మడు మరెక్కడా కనిపించకుండా పోయింది. క్రికెట్ మ్యాచ్ సమయానికి చేరుకుంటుందని అందరూ ఆశగా ఎదురుచూశారుగానీ.. అప్పుడు కూడా రాలేదు. దీంతో అభిమానులతోపాటు సినీతారలు కూడా కాస్త నిరాశకు గురయ్యారు. ఆ విషయాన్ని గ్రహించిన అమ్మడు.. తాను హాజరుకానందుకు ట్విటర్’లో జవాబిచ్చింది. చెన్నైలో వేరే అటెండ్ కావాల్సిన పని ఉన్నందువల్ల వెళ్లిపోవాల్సివచ్చిందనీ తాను ఆ షోనుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని.. అందుకే క్రికెట్ మ్యాచ్’లో ఆడలేకపోయానని తెలిపింది. తాను హాజరుకానందుకు ‘సారీ’ అని పోస్ట్ చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruth prabhu  memu saitham programme  tollywood stars cricket  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more