Junior ntr allu arjun producer tagor madhu katthi telugu remake movie tollywood news

junior ntr latest news, junior ntr latest movies, junior ntr, junior ntr news, junior ntr wikipedia, allu arjun news, allu arjun movie, katthi movie, producer tagore madhu, katthi telugu remake movie, pawan kalyan, tamil hero vijay, samantha ruth prabhu, telugu news

junior ntr allu arjun producer tagor madhu katthi telugu remake movie tollywood news

పవన్ కు రివర్స్ గేర్ లో ఎన్టీఆర్ పయనం..?

Posted: 11/17/2014 01:24 PM IST
Junior ntr allu arjun producer tagor madhu katthi telugu remake movie tollywood news

చిత్రపరిశ్రమలో ప్రస్తుతం పరిణామాలను చూస్తుంటే.. పవన్ కు రివర్స్ గా ఎన్టీఆర్ పయనిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవుగానీ.. చిత్రాలపరంగా మాత్రం అప్పుడప్పుడు పోటీ పడుతూ వుంటుంది. అయితే ఈసారి పవన్ వద్దనుకున్న విషయాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారనే వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఆ విషయం ఏంటనుకుంటున్నారా..? ఆ విషయం తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

తమిళంలో చాలాకాలంనుంచి సరైన హిట్ లేక కొట్టుమిట్టాడిన హీరో విజయ్, సమంతకు ‘‘కత్తి’’ సినిమా ఆ లోటును తీర్చిసిన విషయం తెలిసిందే! ఈ సినిమా తమిళనాటలో భారీ విజయాన్ని అందుకుని, 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయాలని భావించి నిర్మాత ఠాగూర్ మధు దీని రైట్స్ తీసుకున్నారు. మొదట్లో ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారు గానీ.. స్ట్రెయిట్ గా రీమేక్ చేసి హిట్ కొట్టాలని భావించారు. అందుకే ఈ సినిమాను స్టార్ హీరోతో తెరకెక్కిస్తే ఘనవిజయం సాధిస్తుందనే ఆశతో ఆయన మొదట పవన్ దగ్గరకు వెళ్లారు. అయితే ఆయన ‘కత్తి’ మూవీపై ఆసక్తి చూపించకపోవడంతో తిరిగి తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలని భావించారు. ఆ నేపథ్యంలోనే ఆయన అన్ని పనులు పూర్తి చేసుకుని నవంబర్ 21వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఆయన తన నిర్ణయాన్ని మళ్లీ మార్చేసుకున్నారు. చిత్రం విడుదలను ఆపేశారు.

ఎలాగైనా ‘‘కత్తి’’ని తెలుగులో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకోవాలనే పక్కా నిర్ణయంతో నిర్మాత ఠాగూర్ మధు వున్నారని సమాచారం! అందుకే పవన్ తో కాకపోయిన ఇతర హీరోతో తీయాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారట! అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని ఒప్పించి, ‘కత్తి’ తెలుగు రీమేక్ ను తెరకెక్కించాలని ఆయన అనుకుంటున్నారట! అయితే గతకొన్నాళ్లనుంచి సరైన హిట్ లేక ఆందోళనలో మునిగిన ఎన్టీఆర్ ఈ రీమేక్ మూవీ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ తో బిజీగా వున్న ఎన్టీఆర్.. ఈనెల 24న గోవాలో చిత్రీకరణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ కు తిరిగి రాగానే ‘కత్తి’ చిత్రం చూసి తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఆ ఇద్దరి హీరోల్లో ఎవరు ‘కత్తి’ రీమేక్ లో నటించనున్నారనే క్లారిటీ ఓ వారం రోజుల్లో వచ్చే అవకాశాలున్నాయి. అంతవరకు వెయిట్ అండ్ సీ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr  allu arjun  pawan kalyan  katthi remake movie  telugu news  producer tagore madhu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more