Megastar chiranjeevi house problems 150 movie schedules nepal astrologers

chiranjeevi, chiranjeevi news, chiranjeevi 150 movie news, chiranjeevi nepal tour, chiranjeevi movie house, chiranjeevi hot gossips, chiranjeevi movie news, chiranjeevi ram charan

megastar chiranjeevi house problems 150 movie schedules nepal astrologers

చిరును చుట్టుముట్టిన ‘గృహదోషం’.. అందుకే ఆలస్యం!

Posted: 11/15/2014 03:57 PM IST
Megastar chiranjeevi house problems 150 movie schedules nepal astrologers

మెగాస్టార్ చిరంజీవికి గతకొన్నాళ్ల నుంచి గృహదోషం పట్టుకుందనే వార్తలు ఇప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. అందుకే ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కాస్త సైలెంటుగా వున్నారని సమాచారం! అసలు విషయం ఏమిటంటే.. చిరు తన 150వ చిత్రం విషయంపై ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా లేదు. నిజానికి ఆయన తన బర్త్ డే సందర్భంగానే చిత్రం వివరాలతోపాటు దర్శకుడు ఎవరన్న విషయాన్ని బయటపెట్టాల్సి వుండేది. చిరు తన సినిమా వివరాలగురించి వెల్లడిస్తాడని అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేశారు కానీ.. ఆయన మాత్రం ఒక్కమాట కూడా చెప్పకుండా సైలెంట్ గా వుండిపోయారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన తన సినిమా గురించి పెదవే విప్పడం లేదు.

అయితే చిరు తన సినిమా వివరాలు వెల్లడించకపోవడానికి బలమైన కారణముందని.. ఆయనకు గృహదోషం చుట్టుకుందనే వార్తల ప్రచారాలు మొదలయ్యాయి. ఆ ప్రచారాలు ఎలా మొదలయ్యాయంటే.. చిరు తన బర్త్ డే సందర్భంగా నేపాల్ లోని పశుపతి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేసిన విషయం తెలిసిందే! ఆ సమయంలో చిరు తన 150వ చిత్రానికి మంచి ముహూర్తం పెట్టాలని అక్కడి జ్యోతిష్కులను కోరారట. అయితే అందుకు కొంతకాలం వరకు ఆగాలని.. అక్టోబర్, నవంబర్ మాసాల్లో శివారాధనలో గడపాలని సూచించారట. కార్తీక మాసం అనంతరం సినిమా గురించి ప్రకటన చేయడం మంచిదని వారు సూచించారట. అందుకే.. ఇంతకాలం చిరు తన సినిమా గురించి ఎటువంటి విషయాలను వెల్లడించలేదని సమాచారం! అంతేకాదు.. జ్యోతిష్కులు ఇచ్చిన సలహాల మేరకు ఆయన తన నివాసంలో భారీగా మార్పులు, చేర్పులు చేయించారని విషయాలు కూడా వెల్లడవుతున్నాయి.

ఇన్నాళ్లవరకూ తన సినిమా గురించి ఒక్క విషయం కూడా బయటపెట్టని చిరు.. డిసెంబర్ మొదటివారంలో ఖచ్చితంగా వెలువడిస్తారని వార్తలు వస్తున్నాయి. అప్పటికి ఆయనకు కలిగిన గృహదోషం పూర్తిగా తొలగిపోతుందని.. కార్తీకమాసం కూడా అయిపోతుందని.. ఆ తర్వాత ఆయన 150వ చిత్రం గురించి ప్రకటించడం ఖాయమని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే.. ఇంతకీ సినిమా కథను చిరు అసలు ఎంపిక చేసుకున్నారా..? లేదా..? ఎటువంటి కథతో ఆయన తిరిగి వస్తారు..? అసలు ఆ సినిమాకు దర్శకుడు ఎవరు..? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించాలంటే.. స్వయంగా చిరునే పెదవి విప్పాల్సి వుంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  ram charan  nepal astrologers  telugu news  chiru 150 movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more