Sruthi hassan accepts hrithik roshan challenge but salman khan not yet given responce

sruthi hassan, salman khan, hrithik roshan, hrithik roshan bang bang challenge, sruthi hassan hrithik roshan, hrithik roshan praises sruthi hassan, salman khan hrithik roshan challenge, bang bang challege, bollywood celebrities, aamir khan, priyanka chopra, shahrukh khan, ranveer singh

sruthi hassan accepts hrithik roshan challenge but salman khan not yet given responce

శృతిహాసన్ అంగీకరిస్తే.. సల్మాన్ స్పందించలేదు!

Posted: 10/09/2014 08:55 PM IST
Sruthi hassan accepts hrithik roshan challenge but salman khan not yet given responce

సినీపరిశ్రమలో వున్న తారలకు సంబంధించి ఈమధ్యకాలంలో వార్తలు, గాసిప్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇక బాలీవుడ్ తారల విషయంలో అయితే ఇవి మరీ ఎక్కువగా వస్తుంటాయి. ఇక అసలు విషయానికొస్తే.. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కు ఇటు సౌత్ ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ వున్న సంగతి అందరికీ తెలిసిందే! ఇక ఈ అమ్మడికి సంబంధించిన వార్తల విషయానికొస్తే... ఇప్పటికే శృతి ప్రేమవ్యవహారాల మీద ఎన్నో వార్తలు, పుకార్లు షికార్లు చేశాయి. గతంలో హీరో సిద్ధార్థతో కలిసి కొన్నాళ్లపాటు సహజీవనం చేసిందని.. తర్వాత ఒక బిజినెస్ మేన్ తో సీక్రెట్ గా ఎఫైర్ నడుపుతున్నట్లు రకరకాల గాసిప్పులు బయటికొచ్చాయి. అయితే వాటన్నింటినీ ఈ అమ్మడు ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈ అమ్మడికి, బాలీవుడ్ కండలవీరుడు సంబంధించిన ఓ వార్త అన్నిచిత్రరంగాల్లో బాగానే చక్కర్లు కొడుతోంది. ఓ విషయంలో శృతిహాసన్ అంగీకరిస్తే... సల్మాన్ ఖాన్ మాత్రం ఇంతవరకు స్పందించడంలేదని వార్తలొస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే... బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన తాజా చిత్రం ‘‘బ్యాంగ్ బ్యాంగ్’’ ప్రమోషన్ లో భాగంగా ఇతర హీరోలను సవాళ్లు విసురుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడు సెక్సీమణి శృతిహాసన్ కు కూడా ఒక ‘‘బ్యాంగ్ బ్యాంగ్’’ ఛాలెంజ్ చేశాడు. అదేమిటంటే.. ‘‘'మీరు మీ మతాన్ని అనుసరించండి, అలాగే అందర్నీ ప్రేమించండి’’ అంటూ ఓ ప్లకార్డు మీద సందేశం రాసి పట్టుకున్న ఓ వ్యక్తిని వెతికి పట్టుకుని.. అతనికి ఓ హగ్ ఇచ్చి.. అతను పట్టుకున్న ప్లకార్డును ఓ 30 సెకన్లపాటు పట్టుకుని నిలబడగలవా..?’’ అంటూ శృతికి ఛాలెంజ్ చేశాడు. హృతిక్ ఈ ఛాలెంజ్ ను ప్రకటించిన వెంటనే శృతి స్వీకరించింది. తాను చెప్పినట్లుగానే ఆ వ్యక్తిని వెతికి, అతనికో హగ్ ఇచ్చి, 30 సెకన్లపాటు ఆ ప్లకార్డును పట్టుకోగలనంటూ ఆమె వెంటనే అంగీకరించింది. దీంతో సంతోషించిన హృతిక్.. ఆకాశానికెత్తేశాడు. అసలైన రాక్ స్టార్ శృతియేనంటూ మనోడు ఆమె మీద ప్రశంసల వర్షాన్నే కురిపించేశాడు.

ఒకనాడు హృతిక్ రోషన్ ముంబై రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన చేతిలో ఆ ప్లకార్డును పట్టుకుని నిలబడినట్లు కనిపించాడట! అలా అతనికి ఆ వ్యక్తి చాలాసార్లే కనిపించాడట! దీంతో అతను చేస్తున్న ఆ ప్రచారానికి ముగ్ధుడైన హృతిక్.. అతని ఫోటోను తీసుకుని పెట్టుకున్నాడు. సదరు ఫోటోను శృతికి కూడా ఇతగాడు పంపించాడు. ఏ ప్రయోజనం ఆశించకుండానే ఉత్తమ ప్రపంచంకోసం అలా ప్లకార్లు పట్టుకుని కొన్ని గంటలపాటు ఆ వ్యక్తి రోడ్డుపైనే నిల్చున్నాడని హృతిక్ తెలిపాడు. దీంతో అతను ఆ వ్యక్తిని వెతికి పట్టుకోవాల్సిందిగా ఓ ఓపెన్ ‘‘బ్యాంగ్ బ్యాంగ్’’ ఛాలెంజ్ ను బాలీవుడ్ తారలకు విసిరాడు. ఈ ఛాలెంజ్ ను బాలీవుడ్ తారలు అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా తదితరులు కూడా స్వీకరించారు. కానీ హృతిక్ కి మంచి స్నేహితుడని పేరున్న కండలవీరుడు సల్మాన్ మాత్రం ఆ ఛాలెంజ్ ను స్వీకరించలేదు. ‘‘బ్యాంగ్ బ్యాంగ్’’ సినిమా విడుదలకు ముందే ఒక సందేశాన్ని పెయింట్ చేయాలని హృతిక్ అప్పట్లో సవాలు చేశాడు. దానికి సల్లూభాయ్ నుంచి ఇంతవరకు స్పందనే రాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more