Mahesh babu to visit ai movie audio launch as special guest with arnold rajnikanth kamal hassan

mahesh babu, tollywood prince mahesh babu, arnold schwarzenegger, hollywood star arnold schwarzenegger, kamal hassan, rajnikanth, ai movie audio launch, ai movie news, ai movie special guest, manoharudu movie, manoharudu movie audio launch, director shankar, tamil director shankar

mahesh babu to visit ai movie audio launch as special guest with arnold rajnikanth kamal hassan : the tollywood prince mahesh babu to share ai movie audio platform with arnold, rajnikanth and kamal hassan on september 15

ఆర్నాల్డ్ తో కలిసి పండగచేయనున్న మహేష్!

Posted: 09/09/2014 12:44 PM IST
Mahesh babu to visit ai movie audio launch as special guest with arnold rajnikanth kamal hassan

హాలీవుడ్ ప్రముఖ కథానాయకుడైన ఆర్నాల్డ్ తో కలిసి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు త్వరలోనే పండగ చేయనున్నాడని లేటెస్ట్ టాక్! అయితే వీరిద్దరూ కలిసి పండగ చేసేది తెరమీద కాదులెండి... సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ తాజాగా తెరకెక్కించిన ‘‘ఐ’’ మూవీ ఆడియో ఫంక్షన్ లో! దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారాలు జరుపుతున్న భాగంలోనే ఈ మూవీ నిర్మాతలు ఆర్నాల్డ్ ను ఆడియో విడుదల ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఇదివరకే కబురు పంపినట్టు తెలిసిందే! ఆ విషయాన్ని స్వయంగా ఆర్నాల్డ్ కూడా ధృవీకరించాడు.

ఇప్పుడు ఆ ఆడియో వేడకకు మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకడైన మహేష్ బాబు ఆయనతో కలిసి ఆడియో వేదికను షేర్ చేసుకోనున్నాడు. కేవలం ఇతనే కాదు.. సౌత్ సూపర్ హీరో రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లు కూడా ఈ వేదిక మీద కనువిందు చేయనున్నారు. ఇటువంటి పెద్ద స్టార్ల మధ్య మన టాలీవుడ్ ప్రిన్స్ కూడా కనిపించడం ఎంతో విశేషం. ఇలా ఇంత మంది సూపర్ స్టార్స్ ని ఒకే చోట చూడటం వారి అభిమానులకు కన్నులపండుగగా ఉంటుంది. ఈ దెబ్బతో మరోసారి ప్రిన్స్ తన ఫాలోయింగ్ ఏంటో మళ్లీ రుజువు చేసి నిరూపించాడంటూ ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే జరిగిన మహేష్ బాబు ‘‘ఆగడు’’ ఆడియో ఫంక్షన్ కి డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయిన విషయం తెలిసిందే! ఆ సందర్భంలోనే శంకర్, మహేష్ బాబు తన ‘‘ఐ’’ మూవీ ఆడియోకు రావాల్సిందిగా ఆహ్వానించారని.. మహేష్ బాబు అందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని చెబుతున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘‘ఐ’’ (తెలుగులో మనోహరుడు) మూవీలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఆడియో లాంచ్ సెప్టెంబర్ 15వ తేదీన చెన్నైలో భారీ ఎత్తున జరగనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  arnold schwarzenegger  kamal hassan  rajnikanth  director shankar  ai movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more