చిన్న సినిమాలతో మొదలు పెట్టి.., రాజమౌళి లాంటి దర్శకుల సినిమాలో నటించిన నానికి తిరిగి మంచి రోజులు వస్తున్నట్లు కన్పిస్తోంది. ఈగ తర్వాత అంతగా ప్రభావం చూపలేకపోయాడు. నాని నటిస్తున్న జెండాపై కపిరాజు సినిమా చాలాకాలంగా పలుకారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. దీంతో దానిపైనే దృష్టి పెట్టకుండా ఇతర ప్రయత్నాలు చేశాడు. వేసిన రాళ్ళు ఇప్పుడిప్పుడే తగులుతున్నాయి.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వచ్చే ఓ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడు. దీంతో పాటు శేఖర్ కమ్ముల అసిస్టెంట్ నాగి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయటానికి సిద్ధమయినట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమాను అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మిస్తోంది. సొంత బ్యానర్ వైజయంతి మూవిస్ పైనే ప్రియాంక సినిమా తీస్తోంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ అని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే యూనిట్ ప్రకటన చేసే అవకాశముంది.
అష్టా చమ్మ, అలా మొదలైంది సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నాని పిల్ల జమిందార్ సినిమాతో క్రేజ్ సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన భీమిలి కబడ్డి జట్టు, ఈగ సినిమాలు నాని కెరీర్ ను మలుపు తిప్పుతాయి అనుకున్నారు. అయితే సినిమా హిట్ అయినా నానికి అంతగా పెద్ద ఆఫర్లు ఏవీ రాలేదు. అయితే మళ్లి ఇప్పుడు వరుసగా కధలు వస్తుండటంతో నాని కాలం మారిందని అనుకుంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more