Actor super star krishna welcomes cm kcr film city

actor krishna and kcr, krishna welcomes kcr film city, mahesh father krishna, krishna praises to cm kcr, telangna cm kcr, kcr film city in hyderabad, south inidan film city, tollywood biggies kcr filmcity, congress party, ys rajasekhear reddy and krishna, trs party, padmalaya studio, krishna padmalaya studio, film nagar, super star krirshna, kcr target krishna

actor super star krishna welcomes cm kcr film city: - Tollywood biggies welcomes KCR's filmcity. ... South Indian Film chamber secretary Prasad ,They have met KCR today

కేసిఆర్ పేరును ఫిల్మ్ సిటికి పెట్టాలి: నటుడు కృష్ణ

Posted: 08/07/2014 02:58 PM IST
Actor super star krishna welcomes cm kcr film city

ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా కొత్త కష్టాలు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు ఏ రాజకీయ పార్టీకి సపోర్టు చేయలేదు. కానీ కృష్ణ మాత్రం సమయానికి ఏ గొడుగు అవసరమే అదే ఉపయోగించే వారు. ఇది కేవలం తన పద్మలయ భూములను కాపాడుకోవటానికి సీఎం సీట్లో ఎవరు ఉంటే వారికి భజన చేయటం అలవాటు చేసుకున్నారు నటుడు కృష్ణ. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన్ని కలిసి .. తన పద్మాలయ స్టూడియో భూమలను కాపాడుకున్న విషయం తెలిసిందే. కానీ నేడు పరిస్థితి మారింది. సూపర్ స్టార్ కృష్ణ మారాడు అనేది .. ఈరోజు బయపడింది.

నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన ఘట్టమనేని కుటుంబం నేడు .. గులాబీ పార్టీకి జై అంటూ తెరలేపింది. తెలంగాణలో రెండువేల ఎకరాలతో నిర్మించబోయే ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ ప్రతిపాదించారు. ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ... ఫిల్మ్ సిటీ నిర్మాణాన్ని స్వాగతించింది.

పలువురు సినీ పెద్దలు ఈ సందర్భంగా కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండువేల ఎకరాల్లో రాష్ట్రంలో ఫిల్మ్ సిటీని నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని కేసీఆర్ సూచించారు.

ప్రపంచ సినిమాకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తరలిపోదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో సినీ పరిశ్రమకు మేలు జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఒక్కసారి మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి పై పొగడ్తలు కురిపించటంతో టాలీవుడ్ పెద్దలు ఖంగుతిన్నారు. పద్మాలయ భూముల కోసమే కేసిఆర్ కు భజన చేస్తున్నారని టాలీవుడ్ పుకార్లు పుట్టాయి. దీంతో మహేష్ సినిమాలపై. కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. కృష్ణ కు దైర్యం లేక ఇలా చేశాడో లేక భయపడి ఇలా చేశాడో తెలియదు గానీ, మొత్తానికి .. నీకాల్మోక్తా.. బాంచన్ దొర !! అంటూ సూపర్ స్టార్ కృష్ణ లొంగిపోవటం మహేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more