Genelia forced me to do ek villain riteish

Genelia forced to Ek Villain, Genelia Dsouza Deshmukh, Ek Villain Riteish Deshmukh, Riteish Deshmukh,

Genelia forced me to do Ek Villain-Riteish

ఆమె కోసమే అలా చేశా..!

Posted: 06/28/2014 09:06 AM IST
Genelia forced me to do ek villain riteish

ఆమె కోసమే అలా చేశాను..? అలా ఎందుకు అంటే.. ఆమెంటే నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. అంటూ ఒక బాలీవుడ్ నటుడు దైర్యంగా చెబితే.. అందరు ఏమనుకుంటారు. తప్పనిసరిగా .. ప్రతిఒక్కరు మరోలా అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు.. మీరు అనుకున్నదానికి కొంచెం సరిపోతుంది. ఆ నటుడు, ఆయనకు ఇష్టమైన భార్య కోసమే అలా చేసినట్లు గర్వంగా చేబుతున్నారు. ఇందులో కొత్త మీ లేదు. కొంచెం ఢిఫరెంట్ గా ఉంటుంది.

నిన్నటి వరకు హీరోగా కనిపించి ..సడన్ గా విలన్ గా మారితే ఎలా ఉంటుంది. ఆయన అభిమానులు చాలా బాధపడతారు. కానీ ఆయన భార్య ఇష్టం మేరకు విలన్ గా నటించానని నవ్వుతూ చెబుతున్నాడు..బొమ్మరిల్లు చిన్నది జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్.

తన భార్య జెనీలీయా అడగడంతోనే విలన్ రోల్ ప్లే చేశానని రితేష్ దేశ్ ముఖ్ స్పష్టం చేశాడు. ఈరోజు రిలీజైన తన మూవీ ‘ఏక్ విలన్’ గురించి మాట్లాడిన ఆయన తన వైఫ్ నెగిటివ్ రోల్ ప్లే చెయ్యలని, కోరిందని…ఆమె కోసం తాను ఆ రోల్ ప్లే చేయక తప్పలేదన్నారు. జెనీలియా ఎప్పుడు నెగటీవ్ రోల్ ప్లే చేయాలని అడుగుతోందని మూవీ స్టోరీ నచ్చడంతో ఆమె కోరిక తీర్చకలిగానన్నారు.

తాజాగా రిలీజైన ఈ మూవీ మంచి టాక్ తెప్పించుకుంది. దాంతో పాటు రితేష్ క్యారెక్టర్ కు మంచి పేరు వచ్చిందని ఆయన చెప్పారు. ఈ మూవీని మోహిత్ సూరి డైరెక్ట్ చేశారు. గతంతో ఆషికీ 2ని డైరెక్ట్ చేసిన మోహిత్ ఏక్ విలన్ లోనూ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉందని..ఇది నాకు ఒక ఎక్స్ పీరియన్స్ లాంటిదని చెప్పుకొచ్చారు రితేష్.

genelia-ek-villain

అయినా మొగుడ్ని విలన్ గా చూడాలనే కోరిక జెనీలియకు రావటం చాలా ఆశ్చర్యంగా ఉందని బాలీవుడ్ బాబులు అంటున్నారు. కానీ దానికి ఒక కారణం ఉందని కొత్త పుకారు ఒకటి బాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. రితేష్ ..హీరో నటిస్తే.. చాలా మందీ హీరోయిన్లకు దగ్గరై.. కొత్త రొమాన్స్ రుచిచూస్తాడు..? అదే విలన్ రోల్ అయితే.. హీరోయిన్లకు విలన్ ఎలాంటి రొమాన్స్ సన్నివేశాలు, ప్రేమ పాఠాలు ఉండావు అందుకే జెనీలియా తన భర్తకు ఈ కోరిక కోరినట్లు బాలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు.

దీని వల్ల .. జెన్నీకి వచ్చే లాభం ఏమిటి? అంటే.. రితేస్ షూటింగ్ లో ఉన్న ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏ హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకోడు. షూటింగ్ అయిన వెంటనే.. ఇంటి వస్తాడు.? జెన్నీ మీద ఉన్న ప్రేమ అలాగే ఉంటుందనే ఉద్దేశమే.. రితేష్ విలన్ పాత్రకు పాణం పోసినట్లు బాలీవుడ్ వర్గాలు చెవులు కొరికేసుకుంటున్నాయి. జెన్నీ బుర్రలో ఇంత తెలివి ఉందా? అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అవును ఇవాళ, రేపు రోజులు ఎలా ఉన్నాయి. ఎక్కడ చూసిన ఎపైర్లు కాలం నడుస్తుంది. అందుకే జెన్నీ చాలా జాగ్రత్త పడుతుంది. ఆ మాత్రం పడాలి లేకపోతే.. రితేష్ ని ఎవరైన ఎగరేసుకుపోతే.. పరిస్థితి ఏమిటి. ఎంతమైన జెన్నీ ముందు చూపు చాలా మంచిదే అని బాలీవుడ్ సీనియర్ భామలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more