ఆ దర్శకుడి కోసం అందాల నయనతార .. చెంపదెబ్బకొట్టించుకుంది. పశుపతి కొట్టిన దెబ్బకు నయన చెంప వాచిపోయింది. ఈ సన్నివేశం చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఒక్కసారి షాక్ తిన్నారు. అసలు పశుపతి నయన ను ఎందుకు కొట్టాడు.? పశుపతి చెంప దెబ్బకొడితే ..నయన ఏడుస్తూ వెళ్లి కూర్చీలో కూర్చుంది. అదీ కూడా దర్శకుడు సమక్షంలోనే జరిగింది. ఆ సమయంలో దర్శకుడు ఏం చేయలేక సైలెంట్ గా వెళ్లి నయన కన్నీళ్లు తుడిసే పనిలో బిజీగా ఉండిపోయాడు.
అసలు నయన విషయంలో ఏం జరిగిందంటే? శేఖర్ కమ్ముల దర్శకత్వంలో .. అనామిక షూటింగ్ జరుగుతుంది. చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు. ఆ సమయంలో నయన అక్కడి వచ్చింది. వెంటనే పశుపతి లేచి .. నయన చెంప పగలగొట్టాడు. సీన్ కట్ చేస్తే.. ఎక్స్ లెంటూ, సీన్ సూపర్ గా వచ్చిందని దర్శకుడు నవ్వూతూ.. నయన చెంపను రద్దుతూ .. వ్యాటిటీ వ్యాన్ లోకి తీసుకుపోవటం జరిగింది.
ఈ సన్నివేశం చూసిన చిత్ర సిబ్బంది షాక్ తిన్నారు. ఈ సినిమాలో ఓ పోలీస్‌స్టేషన్ సీన్...పశుపతి ఇన్‌స్పెక్టర్ పాత్రను చేస్తున్నాడు. సీన్ పూర్తయింది. కానీ దర్శకుడు శేఖర్‌కమ్ములలో ఏదో అసంతప్తి. ఆయనకు, పశుపతికి మధ్య సెట్‌లో ఏదో సీరియస్ చర్చ నడుస్తోంది.
మానిటర్‌లో ఓ సీన్‌ని పదేపదే రిపీట్ చేస్తూ చూస్తున్నారు. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందామని నయనతార అక్కడికి వెళ్లింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్ర చేస్తున్న పశుపతి..నయనతారను చెంపదెబ్బ కొట్టే సన్నివేశాన్ని శేఖర్‌కమ్ముల పదేపదే చూస్తున్నాడు. ఆ సీన్ అంతగా పండలేదని నయనతారకు అర్థమైంది.
ఆమె వెంటనే పశుపతితో నిజంగానే చెంపదెబ్బ కొట్టించండి. బాధనిపించినా ఫర్వాలేదు. సీన్ పండాలంటే తప్పదుమరి అని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే ఆ సీన్ రీషూట్ చేశారు. పశుపతి బలంగా నయనతార చెంపమీద కొట్టాడు.
ఆమె బాధను బిగపట్టుకుంది. సీన్ అద్భుతంగా వచ్చిందని యూనిట్ అంతా ప్రశసించారు. కానీ సాయంత్రానికి నయన చెంప వాచిపోవటంతో.. చిత్ర దర్శకుడు ఆమె చెంపకు ఆయిల్ మెంట్ చెయ్యటానికి వ్యానిటీ వ్యాన్ వెళ్లటం జరిగింది.
ఆ తరువాత షూటింగ్‌కు అంతరాయం కలగడంతో రెండురోజుల పాటు నిలిపివేశారు. తనవల్ల షూటింగ్ ఆగిపోవడం ఇష్టంలేని నయనతార తానే స్వయంగా మళ్లీ షూటింగ్ స్పాడ్ కి రావటంతో..చిత్ర యూనిట్ సభ్యులు షాక్ తిన్నారు. నయన చెంప వాచిన.. సీన్ మాత్రం బాగా వచ్చిందని చిత్ర సిబ్బంది జోకులు వేసుకుంటూ.. పనిలో బిజీ అయ్యారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more