దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆసిన్ బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ అవకాశాల వేటలో వెనకబడి ఖాళీగా ఉంటే టైం వేస్ట్ అనుకుందో ఏమో కానీ, ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మతో ప్రేమాయణం మొదలు పెట్టిందని సినీ వర్గాల సమాచారం. ఆసిన్ స్నేహితుడి ద్వారా ఓ కార్యక్రమంలో పరిచయం అయిన ఈ సెల్ ఫోన్ బాస్ తో మెల్లి మెల్లిగా మాటలు కలిపి, పరిచయం పెంచుకుందట.
ఈ పరియం కాస్త స్నేహంగా మారడంతో ఆ కంపెనీ ఏ కొత్త మోడల్ ని లాంచ్ చేసినా ఆసిన్ కి స్పెషల్ ఇన్విటేషన్ పంపిస్తూ ఇంకాస్త దగ్గరయ్యి, ఆ బంధాన్ని ప్రేమగా మలుచుకున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వీరి ప్రేమ పీకల్లోతు వరకు వెళ్లిందని, క్షణం కూడా ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారని అంటున్నారు.
మైక్రో (సూక్ష్మంగా) చిన్నగా మొదలైన వీరి పరిచయం మ్యాక్స్ (గరిష్టంగా) పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. సినీ జనాలు మాత్రం గజినీ సినిమాలో తాను పోషించిన పాత్రను నిజ జీవితంలో నిజం చేసుకుంటుందని అంటున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more