మళ్లీ.. మళ్లీ .. పిలవాలనింపించే పేరు బాలీవుడ్ ఐశ్వర్యం .. అయిననటి ఐశ్వర్యరాయ్ బచ్చన్. వెండితెరపై ఐశ్వర్య అని పడితే.. అభిమానులు.. మనుసుల్లో లవ్ లైట్ వెలుగుతుంది. ఇప్పటి వరకు తన పాపతో.. కాలం గడిపిన ఐస్ ఇక నుండి వెండితెరపైకి రీ ఎంట్రి ఇస్తుందనే టాక్ బాలీవుడ్ , కోలీవుడ్ ల్లో వినిపిస్తుంది.
ఐష్ రాక కోసం .. కుర్రకారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా తమిళ, తెలుగు భాషల్లో పి.వాసు ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం.
ఐశ్వర్య కోసం పి. వాసు ఒక అద్భుత కథను తయారు చేయటం జరిగిందనే పుకార్లు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ కథ విని, ఐష్ ఎగ్జయిట్ అయ్యారని పి. వాసు సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమాకు తమిళంలో ‘ఐశ్వర్యావుం ఆయిరమ్ కాక్కావుమ్’ నే పేరును నిర్ణయించించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అంటే.. ఐశ్వర్యా.. వెయ్యి కాకులు అని అర్థం. ఇప్పటి వరకు భారతీయ తెరపై రానటువంటి అద్భుత కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని పి. వాసు అంటున్నారు.
ఈ సినిమాకు యానిమేషన్ సన్నివేశాలను రూపొందించడానికి పలు ప్రముఖ విజువల్ ఎఫెక్ట్ సంస్థలతో పి. వాసు చర్చిస్తున్నట్లు తెలిసింది. షూటింగ్‌ను కాంబోడియాలో వేసిన భారీ సెట్లోను, కొండ ప్రాంతాల్లోను వేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ సరసన నటించే ఇద్దరు ప్రముఖ హీరోల, ఎంపిక జరుగుతున్నట్లు.. మీడియా వర్గాలు అంటున్నాయి. ఇందులో పలు సాహస పోరాట సన్నివేశాలు ఉంటాయని, వాటి కోసం ఐష్ ఫైట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమా తెలుగు దర్శకుడు రాజమౌళి తీస్తున్న బాహుబలి ని మించిపోతుందని.. కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more