Celebrities to face for misleading ads

celebrities to face for misleading ads, Central Consumer Protection Council, KV Thomos CCPC Chairman, Celebrities in ads responsible

celebrities to face for misleading ads, celebrities in ads responsible

చర్మసౌందర్యానికి రహస్యం- నిజం చెప్పకపోతే తిప్పలు?

Posted: 02/04/2014 10:57 AM IST
Celebrities to face for misleading ads

చర్మ సౌందర్యం గురించి కానీ, ఒత్తైన జుట్టు గురించి కానీ మరేవిధమైన వాణిజ్య ప్రకటనలలోనూ ఉత్పాదనల అమ్మకాలను పెంచటానికి చెప్పే మాటలలో తేడా వచ్చిందో ఇక అంతే అంటోంది మంత్రి కె.వి.థామస్ నేతృత్వంలో నిర్ణయం తీసుకున్న కేంద్ర వినియోగదారుల భద్రతా సంఘం (సిసిపిసి). 

ఉత్పాదన సంస్థలు చెప్పిన మాటలు వినియోగదారులు వినిపించుకోరేమోనన్న ఉద్దేశ్యంతో మోడల్స్ తో చెప్పిస్తుంటారు.  ఇంకా ఖర్చు పెట్టగల స్తోమతున్న ఉత్పాదక సంస్థలు సినిమా అగ్రతారల ద్వారా చెప్పిస్తుంటారు.  హీరో హీరోయిన్లకు ఇది అదనపు ఆదాయంగా మారింది. ఏ సినిమా హీరో హీరోయిన్లు సినిమాల్లో విజయం సాధించి ప్రచారంలో ఉంటారో వాళ్ళకు ఈ వాణిజ్య ప్రకటనల కాంట్రాక్టులు దొరకటం కద్దు.

అయితే సిసిపిసి తీసుకున్న నిర్ణయం వలన, ఉత్పాదనలలో ప్రకటించిన ప్రయోజనం లేని పక్షంలో వినియోగదారులు ఇప్పటివరకూ తెరవెనుకనుండే ఆయా సంస్థల మీద కేసు పెట్టవచ్చన్న వెసులుబాటు ఇప్పుడు ఆ ప్రకటనలలో భాగస్వాములై ప్రముఖంగా తెర మీద కనిపించే తారల మీద కూడా కేసు పెట్టవచ్చని చెప్తోంది.  ప్రకటనలలో ఉన్న ఉత్పాదనలను ఆ హీరో హీరోయిన్లు స్వయంగా ఉపయోగించరన్న సంగతి అందరికీ తెలుసు కానీ ప్రకటనలలో వాళ్ళు కనిపించటం వలన ఆయా వినియోగదారుల మనసులో ఉత్పాదనలతో తారలను ముడివేసుకుంటారు.  దానితో, ఎప్పుడు ఆ తారలను చూసినా ఈ ఉత్పాదనలు కూడా గుర్తుకు వస్తాయి.  అదీ తారలను ప్రకటనలలో చూపించటానికి కారణం.  అందువలన అందుకు అవకాశమిచ్చే సినీ తారలకు కూడా జవాబుదారీని అంటగడుతూ సిసిపిసి ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రకటనలలో కనిపించే ముందు కేవలం పారితోషికాన్ని చర్చించుకోవటం, అగ్రిమెంటు చేసుకోవటం మాత్రమే కాకుండా, వారు ప్రాతినిధ్యం వహించి అమ్మకాలు పెంచటానికి చేస్తున్న ఉత్పాదనల విషయంలో వాటి మీద అవగాహన, ఉపయోగించి చూడటం లాంటి జాగ్రత్తలు వహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందా అంటే వేచి చూడవలసిందే.  ఎందుకంటే వినియోగదారుల మీదనే సరిగ్గా కేసులు నమోదు కావటం లేదు. 

అతిశయోక్తిలా కనిపించే ప్రకటనల విషయంలో పరవాలేదు కానీ అలా కనిపించకుండా నిజంగా ఆయా తారల విషయంలో వాళ్ళకి ఎంతో ఉపయోగపడిందనే అపోహ కలిగించి నిజానికి వాటిలో అటువంటి లక్షణాలే లేనట్లయితే తారల కాస్త ఇబ్బంది పాలవక తప్పదేమో.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more