దేనికైనా రెడీ సినిమా సినిమా టైటిల్స్ లో మోహన్ బాబు పేరుకు ముందు పద్మశ్రీ చేర్చటం మీద వివాదంగా మారి వాటిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చెయ్యమని, భవిష్యత్తులో పేరుతో పాటు ఉపయోగించవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటం,
అయినా ఆ తర్వాత వచ్చిన సినిమాలలో కూడా ఉపయోగించటంతో మోహన్ బాబు మీద కోర్టులో పిటిషన్ వెయ్యటం జరిగింది. అందుకు కారకులైన భాజపా నాయకుడు ఇంద్రసేనా రెడ్డి రాజకీయ లబ్ధి కోసం గొడవ చేస్తున్నారని, రాబోయే చిత్రం పాండవులు పాండవులు తుమ్మెదా చిత్రంలో కూడా పద్మశ్రీ ని తన తండ్రి మోహన్ బాబు పేరుకు ముందుకు రాయటం జరుగుతుందని మంచు విష్ణు స్పష్టం చేసారు.
ఇది మొదటి సారి కాదని, పద్మశ్రీని సినిమా టైటిల్స్ లో చాలా మంది చాలా సందర్భాల్లో వాడారని, అలా సినిమా టైటిల్స్ లో రాయగూడదనే నిబంధన సినిమా నిర్మాతగా తనకేమీ అందలేదని చెప్పిన మంచు విష్ణు, ఇది కేవలం అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన తన తండ్రి గారి మీద ఉన్న గౌరవాభిమానాలే కానీ పద్మశ్రీ అని రాసినంత మాత్రాన ఎక్కువమంది ప్రేక్షకులు టికెట్లు కొనేస్తారా ఏమిటి అని ప్రశ్నించారు.
రాబోయే సినిమాలలో కూడా పద్మశ్రీని మోహన్ బాబు పేరుతో పాటుగా టైటిల్స్ లో రాయటం జరుగుతుంది అని విష్ణు గట్టిగా చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more