తెలుగు సినిమా రంగానికి రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏన్నార్ లు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వీరిద్దరు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు వెలకట్టలేనివి కూడా. తెలుగు జాతి రత్నాలుగా చెప్పుకునే వీరికి ఇప్పుడు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.
నిన్న ఫిలిం ఛాంబర్ లో జరిగిన అక్కినేని సంతాప సభలో ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ఆర్ నారాయణ మూర్తి కొన్ని రాజకీయ కారణాలవల్ల స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న దక్కలేదనీ, అక్కినేని విషయంలో అయినా భారతరత్న కల సాకారం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. తెలుగు జాతికి వన్నె తేవడమే కాకుండా, తెలుగు జాతి రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేసిన ఎన్టీఆర్ కి రాజకీయ శక్తులు అడ్డువస్తే... ఎటువంటి రాజకీయ మరక లేని అక్కినేని నారాయణ మూర్తి అన్నట్లు భారత రత్న వరిస్తుందా ?
ఒకవేళ ఆయన అన్నట్లు భారత రత్న ఇస్తేనే అక్కినిని తెలుగు జాతి గుర్తిస్తారా ? తెలుగు జాతిలో మేమిలి రత్నాల్లాంటి వీరిని గుర్తించాలంటే వీరికి భారత రత్నలే అవసరం లేదన్నది కొందరి వాదన. ఏది ఏమైనా ఎంతో ప్రతిష్టాత్మంకగా భావించే ‘భారత రత్న ’ అవార్డులు రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి మేలిమి రత్నాలకు అలాంటి అవార్డులు ఇప్పించి కలుషితం చేయడం భావ్యం కాదని మరి కొందరి వాదన.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more