ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు! పవన్ కళ్యాణ్ పెళ్ళి వివాదస్పదం చేస్తున్నవారెవరు, ఎందుకు చేస్తున్నారు, ఏమాశించి చేస్తున్నారు? తమ హృదయాలు ఆక్రోశిస్తున్నాయని ఆయన అభిమానులు చెప్తున్నారంటూ, కథనాలు పుకార్ల వీధిలో షికార్లు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేసింది తప్పా ఒప్పా? రండి విశ్లేషిద్దాం!
ఆడ, మగ ఇద్దరు వ్యక్తుల మధ్య బంధుత్వాలు ఎన్ని విధాలుగా ఉంటాయని చూస్తే-
1. ఒకరి మీద ఒకరికి స్నేహం లేక ప్రేమ కలిగివుండటం జరుగుతుంది. వాళ్ళ మధ్య కలిగిన అతి సమీప సాన్నిహిత్యం వలన ఆకర్షణ పెరిగి లైంగిక సంబంధం ఏర్పడటం జరగవచ్చు.
2. కలిసి జీవించటం కోసం సహజీవనం కాని లేదా వివాహానికి మొగ్గుచూపించటం జరగవచ్చు.
3. పై రెండూ కుదరనప్పుడు మూడవది లైంగిక అత్యాచారానికి ఒడిగట్టటం కానీ లేదా వ్యభిచార గృహాలకు పోవటం కానీ జరిగే అవకాశం ఉంది.
4. భార్యా పిల్లలతో సంసారం చెయ్యటం, వైవాహిక జీవితం గడుపుతూ కూడా భార్యకు తెలియకుండా మరో చోట వ్యవహారం నడుపుతుండటం. పైన చెప్పుకున్నవాటిలో నీత మాలిన, చట్ట విరుద్ధమైన పనులున్నాయన్నది నిజమే!
మనం ఆదర్శంగా తీసుకునే శ్రీరామునితో పోల్చి చూస్తే, పైన చెప్పుకున్నవేమీ ఆ ఆదర్శాలలో ఇమడవు. ఒకే బాణం, ఒకటే మాట, ఒకే ఒక్క భార్య అన్నది ఆదర్శప్రాయం. నిజమే! అయితే మనకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఏం తెలుసు?
మొదటి భార్య నందినితో ఎందుకు పొరపచ్చలు వచ్చాయో మనకి తెలుసా? విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తో మరో వివాహం చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మూడవ వివాహం చేసుకున్నారంటే వాళ్ళిద్దరి సమ్మతంతో జరిగింది కాదా? వాళ్ళకి పరిహారం కూడా చెల్లించటం జరగలేదా?
తప్పు అంటే ఎలా ఉంటుంది- అది చట్టబద్ధంగా తప్పై ఉండాలి లేదా నీతి బద్దంగా చూస్తేనైనా తప్పై ఉండాలి లేదంటే మన ఆచార వ్యవహారాల దృష్ట్యానైనా తప్పై ఉండాలి! మనం పై పేరాలో చెప్పుకున్నవన్నీ ఈ మూడిటిలో ఏదో ఒక దాని వలన అపరాధం లోకి వస్తాయన్నది నిజమే కానీ పవన్ కళ్యాణ్ చేసినదానిలో ఎవరికి నష్టం జరిగింది? భార్యను వేధించటం జరిగిందా లేకపోతే భార్య ఉండగానే మరో వివాహం చేసుకోవటం జరిగిందా లేదంటే అత్యాచారం చెయ్యటం కానీ వ్యభిచార గృహాలకు పోవటం కానీ జరిగిందా?
చట్టబద్ధంగా కానీ, నైతికంగా కానీ, ఆచారాల దృష్ట్యా కానీ పవన్ కళ్యాణ్ చేసినదానిలో తప్పు ఎక్కడ కనపడుతోంది? అంటే, ఇలా బాహాటంగా చట్టసమ్మతంగా చెయ్యకుండా మనం పైన చెప్పుకున్న అక్రమ వ్యవహారాలకు ఒడిగట్టాలని అనుకుంటారా ఎవరైనా- అందులోనూ ఆయన అభిమానులు?
సరే ఇక అభిమానం విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఏ విధంగా వాళ్ళందరికీ అభిమాన పాత్రుడయ్యారు? నందినిని పెళ్ళి చేసుకోవటం వలనా లేకపోతే రేణు దేశాయ్ ని పెళ్ళి చేసుకోవటం వలనా? ఆయన నటన, పాత్రలో ఇమిడిపోయిన విధానం, లేదా డైలాగ్స్ చెప్పే విధానం కానీ పోరాట దృశ్యాలలోనూ డ్యాన్స్ లలోనూ కనిపించిన పవర్ వలనే కదా ఆయనని పవర్ స్టార్ అంటూ పొగిడారందరూ! ఇందులో ఆయన వ్యక్తిగత జీవితం ఎక్కడుంది?
సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండాలని కోరుకుంటారే! కానీ నిజ జీవితంలో ఒకే సమయంలో ఆయనకున్నది ఒక్క భార్యే కదా! అది కూడా బాధని కలిగిస్తుందా అభిమానులకు? అలా అనిపించటం లేదు. ఎందుకంటే అభిమానులు ఈ మాత్రం ఆలోచించలేనివారు కాదు. అంటే కావాలనే పవన్ కళ్యాణ్ మీద బురదచల్లే ప్రయత్నమిది. ఎందుకు?
పవన్ కళ్యాణ్ అనే పేరు కాకుండా అదే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లో మరో కళ్యాణ చక్రవర్తి అనే పేరుని చూసుంటే ఈ గ్రేట్ గ్రేట్ పుకారు వీరులంతా దాన్నో వార్తగా ప్రచురించేవారా? అలా చేస్తే ఎవరూ చదవరని వాళ్ళకి తెలుసు. అందువలన చట్టబద్దంగా చేసిన పనైనా దాన్నో నేరంగా చూపించి అమ్మో అమ్మో ఎంతపనైంది అంటూ బుగ్గలు నొక్కుకునేట్టుగా చెయ్యాలన్నదే వారి తపనంతా! ఆ గ్రేట్ పుకారాంధ్రా వాళ్ళకి ఏం ఒరుగుతోంది దానివలన? ఒకటి రీడర్ షిప్ పెరుగుతుందని ఆశ. అంతేనా? కాదు ఇంకా లోతుగా పరికిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే ఉదంతులు పుట్టటం కూడా కారణమే!
వరుస సినిమా విజయాల వలన వచ్చిన పేరు, ఏర్పడ్డ అభిమానుల బలంతో రాజకీయాల్లోకి వస్తే ప్రస్తుతం వేసుకున్న అంచనాలన్నీ తారుమారవుతాయనే భయం కలిగినవాళ్ళ ప్రోద్బలంతోనూ వాళ్ళ అర్థ బలంతోనూ చేసిన అర్థం లేని ఆరోపణలు రాజకీయాల్లోకి రావటానికి ముందునుంచే పవన్ కళ్యాణ్ ని నైతికంగా దిగజార్చుతాయన్న చిరు ఆశ వాళ్ళది అని అనిపించటం లేదూ?
పవనిజం పవినిజం అంటూ వాపోతున్నారే. ఆ పవనిజంలో ఎక్కడ లోపం జరిగింది ఒక పెళ్ళి చేసుకున్నంత మాత్రాన? పోనీ ఆయనేమైనా నాయకుడా, గురువా, ప్రవక్తా అలా వరుసగా పెళ్ళిళ్ళు చేసుకోవటం తప్పని అభియోగం మోపడానికి? పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఎవరిని ఉద్దేశించీ, ఇలావుండాలి అలా వుండాలి అంటూ ఎప్పుడూ ఉపన్యాసాలు దంచలేదే! ఆయన మీదున్న అభిమానమంతా సినిమా పరదా మీద కనిపించే తీరునిబట్టే కదూ! పరదా మీద కానీ పరదా వెనక జీవితం విషయంలో కానీ ఆయన తనని అభిమానించమని కూడా ఏనాడూ కోరలేదు. సినిమాలో తనకి నచ్చిన విధంగా చేసుకుంటూ పోతే అది నచ్చిన వాళ్ళు ఆయనని తమ అభిమానిగా చేసుకున్నారు. ఆ నటన బావుందన్నారు, ఆ డ్యాన్స్ లు బావున్నాయన్నారు, ఆ టైమింగ్, స్టంట్స్ చాలా చాలా బావున్నాయంటూ పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని పెంచుకున్నారు కానీ ఆయన వైవాహిక జీవితాన్ని చూసి కాదు కదూ!
వాక్స్వాతంత్రం ఉంది, పత్రికా స్వాతంత్రం ఉంది అంటే అవాకులు చెవాకులు రాయటానికి కాదు. నిజాన్ని నిర్భయంగా రాయలేని వారు కూడా పుకార్లకు ప్రాధాన్యతనివ్వటం శోచనీయం.
పవన్ కళ్యాణ్ నటన విషయంలో తేడా వస్తే ఆయన సినిమా అభిమానులకు బాధ కలగవచ్చు, క్రమంగా ఆ అభిమానం తగ్గిపోనూవచ్చు. అది సహజమే కానీ మనకు తెలయని ఆయన వ్యక్తిగతం జీవితంలో ఆంక్షలు విధించటం, బరబరా లక్ష్మణ రేఖలు గీసెయ్యటానికి ఎవరికి అధికారముంది? మనకు వినోదాన్ని పంచి ఇచ్చిన నేరానికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో తలదూర్చటమే కాకుండా చెడు కానిదాన్ని చెడుగా చూపించటానికి వాళ్ళకి అంత పెద్ద కారణం, చెప్పరాని విరోధాలు ఏమున్నాయో తెలియదు కానీ ఎవరో కొందరు చెప్పినట్లుగా ఏవో పేర్లు పెట్టి వెబ్ సైట్లలోరాస్తున్నారు. అది నిజమేనా? వాళ్ళ ఇమెయిల్ ఐడిలు ఉన్నాయా మీ దగ్గర?
ఈ విషయంలో బహిరంగ చర్చకు ఎవరైనా వచ్చినట్లయితే మేము తెలుగువిశేష్ బృందమంతా అందుకు సిద్దమే. అయితే లేనిపోని అభాండాలు వేసి, మసిపూసి మారేడు కాయని చేసే పుకారాంధ్రావాళ్ళు ఆ పనిలో ఎంత గ్రైటైనా హేతుబద్ధమైన చర్చకు వస్తారా?
అభిమానం నిండిన గుండెల మీద చెయి వేసుకుని పైన చెప్పినదంతా చదివిన తర్వాత కూడా మీకు పవన్ కళ్యాణ్ మీద ఇంకా ఏహ్యభావం మిగిలి ఉన్నట్లయితే ఈ వ్యాసం కింద మీ కామెంట్లు రాయండి. మా స్పందన తప్పకుండా ఉంటుందని మాటిస్తున్నాం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more