దర్శక ధీరుడు జక్కన్న హ్యాండ్ పడితే హీరోల కెరియర్ స్పీడ్ కి బ్రేకులు పడతాయా ? ఆయన తో సినిమాలు చేసి బంపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న హీరోలు మరో హిట్టు రావాలంటే సంవత్సరాలు వెయిట్ చెయ్యాలా ? అంటే ఇప్పటి ఆయనతో చేసిన హీరోల ట్రాక్ రికార్డు చూస్తే అవుననే అనిపిస్తుంది.
రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఒక్క పరాజయం కూడా పొందలేదు. ఎన్టీఆర్ కి యమదొంగ చిత్రం తురువాత అంత రేంజ్ హిట్టు రాలేదు. అలాగే ప్రభాస్ కి ‘ఛత్రపతి ’, రామ్ చరణ్ కి ‘మగధీర ’, సునీల్ కి ‘మర్యాద రామన్న ’ లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చిన తరువాత వారి కెరియర్లో చెప్పుకోగ్గ హిట్లు రాలేదు. ఇప్పుడు వారి జాబితాలో మరో కుర్ర హీరో వచ్చి పడ్డాడు. ‘అలామొదలైంది ’ హిట్టు కొట్టి మంచి విజయాలతో దూసుకువస్తున్న హీరో నాని రాజమౌళి తో ‘ఈగ ’ చిత్రం చేశారు.
ఈ చిత్రం కూడా బ్లాక్ బ్లస్టరే. ఈగ తరువాత నానికి ఒక్క హిట్టు కాదు కదా నటించిన సినిమాలు కూడా విడుదలకు నోచుకోవడం లేదు. ఎలాగు ఖాళీయే కదా అని నిర్మాతగా మారి దెబ్బై పోయాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘పైసా ’ పైసలు లేక అయోమయ స్థితిలో పడింది. మరో చిత్రం ‘జెండా పై కపిరాజు ’ షూటింగు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం కూడా అనుకున్నంత విజయం సాధించక పోతే నాని కెరియర్ గాడిలో పడటం కష్టమే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more