హృతిక్ రోషన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు... టైటిల్ ని చూసి ఇది నిజమా... అనుకోకండి ? నిజమే. కానీ ఈ మాట హృతిక్ రోషన్ నోటి నుండి వచ్చింది కాదు. గత కొన్ని రోజుల క్రితం తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సుజానెని ప్రేమించి పెళ్లి చేసుకొని 13 సంవత్సరాలు హాయిగా కాపురం చేసి ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన ఈ దంపతులు ఇటీవలే కొన్ని కారణాల వల్ల విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
వీరిద్దరు విడిపోవడానికి హృతిక్ రోషన్ ఎఫైర్ కారణం అని, కాదు సుజానె నటుడు అర్జున్ రాంపాల్ తో సన్నిహితంగా ఉండటమే కారణం అని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఎంత నిజముందో ఇంత వరకు తేలలేదు. ఆ విషయం ప్రక్కన పెడితే ప్రస్తుతం భార్యతో విడిపోయిన హృతిక్ రోషన్ 2015 లో మరో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నాడు ప్రముఖ జ్యోతిష్యులు బెజాన్ దురవాలా. ఈయనో ప్రముఖ జ్యోతిష్కుడు. గతంలో ప్రముఖుల పై చెప్పిన కొన్ని విషయాలు నిజమవ్వడంతో ఇప్పుడు బాలీవుడ్ జనాలు కూడా హృతిక్ రోషన్ రెండో పెళ్లి చేసుకుంటాడని నమ్ముతున్నారు.
ఈయన ఎఫైర్ నడిపిపాడన్న బార్బరా మోనీని వివాహం ఆడుతాడా ? లేక వేరే అమ్మాయిని పెళ్లాడాతాడా ? అనే విషయాన్ని మాత్రం బెజాన్ చెప్పలేదు. హృతిక్ రోషన్ జాతకమే కాకుండా రణ్బీర్ కపూర్, దీపికా పదుకునె, సల్మాన్ ఖాన్ల జాతకం గూర్చి చెప్పుకొచ్చాడు. 2014లో వీరు ముగ్గురు మంచి ఫాంలోకి వస్తారని అన్నాడు.ప్రస్తుతానికైతే వీరు మంచి రేస్ లోనే ఉన్నారు. ఆయన చెప్పిదేముందని కొట్టేపారేసేవారు ఉన్నారు.
మరి హృతిక్ రోషన్ విషయంలో ఈయన చెప్పింది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more