సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. రోజు రోజుకు మార్కెట్లోకి దిగుమతి అవుతున్న కొత్త వారి పోటీని తట్టుకొని సీనియర్ హీరోయిన్లు నిలబడాలంటే కాస్తంత కష్టమే. రోజు రోజుకు వస్తున్న ఫ్రెష్ అందాల ముందు ముదిరిన హీరోయిన్ల అందాలు బలాదూరే అని చెప్పాలి.
టాలీవుడ్ లో టాప్ హీరోలతో ఆడిపాడిన ముద్దు గుమ్ముల్ని సైతం ముదిరిపోతే పక్కన పెట్టేస్తున్నారు మనోళ్లు. అలా పక్కన పెట్టిన వాళ్ళలో త్రిష ఒక్కరు. ప్రస్తుతం తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా లేకుండా ఖాళీగా ఉన్న చెన్నై చంద్రం త్రిష ఇఫ్పుడు టాలీవుడ్ హాస్య నటుడు శ్రీనివాస రెడ్డితో జత కట్టడానికి అంగీకరించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. శ్రీనివాసరరెడ్డి కథానాయకుడిగా పీవీపీ సంస్థ ఓ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో నటించడానికి త్రిష కూడా అంగీకరించిందని సమాచారమ్.
పవన్ మహేష్, ప్రభాస్ రేంజ్ స్టార్ల సరసన నటించిన ఈ అమ్మడి రేంజ్ ఇంత దిగజారిందా అని టాలీవుడ్ సినీ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కామెడీ స్టార్ కావడంతో స్టార్ హీరోయిన్ అయితే సినిమాకు క్రేజ్ వస్తుందని భావించిన పీవీపీ సంస్థ త్రిషను ఒప్పించడానికి నానా తంటాలు పడటమే కాకుండా, భారీగానే పారితోషికం సమర్పించుకున్నారట. అసలే ఏ చిన్న అవకాశం దొరికినా చాలు అనుకుంటున్న త్రిషకు భారీ మొత్తంలో డబ్బు రావడంతో కమేడియన్ తోనైనా సరే సై అందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more