Sardaar Gabbar Singh | Tickets | Bookings | Benfit shows | Pawan kalyan

Sardaar gabbar singh latest dialogue promos

Sardaar Gabbar Singh Tickets Bookings, Sardaar Gabbar Singh bookings, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

Sardaar Gabbar Singh Latest Dialogue Promos: Powerstar Pawan kalyan Sardaar Gabbar Singh film Advance Tickets Booking started. Sharath marar, sunil lulla producers, DSP Music.

సర్దార్ గబ్బర్ సింగ్ కు ట్యూన్ అవ్వాలి లేదా ఫ్యాన్ అవ్వాలి

Posted: 04/06/2016 04:24 PM IST
Sardaar gabbar singh latest dialogue promos

‘పవర్‘ ఫేం బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.

నగ్నంగా పరిగెత్తుతానంటున్న బాలీవుడ్ కమెడియన్

ఇందులో పవన్ కళ్యాణ్, రాయ్ లక్ష్మీల కాంబినేషన్లో వచ్చిన ‘తోబ తోబ..’ సాంగ్ ప్రస్తుతం దుమ్మురేపుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ట్రైలర్లోనే సినిమా స్టోరీని చెప్పేయడంతో.. సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారోనని ఆసక్తి నెలకొంది.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఎలా వుండబోతుందనే స్టోరీ లైన్ ను ట్రైలర్ లోనే చెప్పేయడంతో... ఇక సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ యాక్టింగ్, మ్యాజిక్ పైనే ఆధారపడివుంది. సినిమాకు వచ్చే ప్రేక్షకులను రెండున్నర గంటల వరకు ఎంటర్ టైన్ చేయగలిగితే సినిమా కొత్త రికార్డులను ఖాయమని సినీవర్గాలు గతకొద్దిరోజులుగా అంచనాలు వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లను విడుదల చేస్తూ.. మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

దుమ్మురేపుతున్న సర్దార్ టికెట్ల ధరలు

తాజాగా ఈ సినిమాలోని ఓ లవ్ రొమాంటిక్ టీజర్ మరియు డైలాగ్ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ చూస్తుంటే.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఇలా ఎంటర్ టైన్ చేస్తే బాగుంటుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా గురించి ఒక్కో టీజర్ ను అభిమానుల కోసం నిర్మాతలు విడుదల చేస్తూ మాంచి కిక్కిస్తున్నారు. ఒకవేళ మొదటి ఆటకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే.. ఈ సినిమా రికార్డులను ఆపడం కష్టమని చెప్పుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  Tickets  Bookings  Pawan kalyan  posters  

Other Articles