celebrity cricket | tamil stars cricket | Chennai | Surya

Tamil nadu celebrity cricket match on 17 april

tamil nadu celebrity cricket on 17 April, Chennai CCL, Surya in CCL, Sardaar Gabbar Singh bookings, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan, Theri

tamil nadu celebrity cricket match on 17 April: Tamil Nadu Cine actors ready to play cricket match on 17 april.

ఏప్రిల్ 17న తమిళ హీరోల క్రికెట్ మ్యాచ్

Posted: 04/06/2016 03:40 PM IST
Tamil nadu celebrity cricket match on 17 april

తమిళనాడు సినీ అభిమానులను అలరించడానికి తమిళ సినీనటులు సిద్ధమవుతున్నారు. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పేరుతో తమిళ నటీనటులు క్రికెట్ ఆడి అలరించనున్నారు. ఈ క్రికెట్ ఈనెల 17న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రికెట్ ఆడటానికి ఓ కారణం కూడా వుంది.
దక్షిణ భారత నటీనటుల సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సేకరించడంలో భాగంగా ఈ స్టార్స్ సెలబ్రెటీ క్రికెట్ నిర్వహించనున్నారు.

ఇందులో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, నటులు పాల్గొననున్నారు. 8 జట్లుగా ఏర్పడి, ఒక్కో జట్టు ఆరు ఓవర్లు ఆడనున్నారు. ఈ 8 జట్ల వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.

జట్టు పేరు - కెప్టెన్
1. రామ్‌రాజ్ చెన్నై సింగమ్స్ - సూర్య
2. ఎస్థల్ మదురై కాళైస్ - విశాల్
3. శక్తి మసాలా కోవై కింగ్స్‌ - కార్తీ
4. ఎమ్జీఆర్ యూనివర్సిటీ నెల్లై డ్రాగర్స్ - జయంరవి
5. రామ్‌నాట్ రైనోస్ - విజయ్‌ సేతుపతి
6. తంజై వారియర్స్ - జీవా
7. సేలం చీటర్స్ - ఆర్య
8. కల్యాణ్ జ్యువెలర్ తిరుచ్చి టైగర్స్ - శివకార్తికేయన్

ఈ సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ కు సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనయగన్ కమల్ హాసన్ లు కూడా హాజరుకానున్నారు. అలాగే హీరోయిన్లు, నటీమణులు, దర్శకనిర్మాతలు, సాంకేతికనిపుణులు ఈ ఈవెంట్ లో పాల్గొని సందడి చేయనున్నారు. త్వరలోనే జట్టు సభ్యుల వివరాలను ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Celebrity cricket  Chennai  Tamil nadu  Arya  

Other Articles