Sardaar Gabbar Singh | Benfit shows | Tickets | Bookings | Pawan kalyan

Sardaar gabbar singh mania across worldwide

Sardaar Gabbar Singh Mania, Sardaar Gabbar Singh, Sardaar Gabbar Singh Tickets Bookings, Sardaar Gabbar Singh bookings, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan, Kajal

Sardaar Gabbar Singh Mania Across Worldwide: Powerstar Pawan kalyan Sardaar Gabbar Singh film will be release on 8 April. Kajal Heroine. Sharath marar, sunil lulla producers, DSP Music.

స్పెషల్ స్టోరీ: ప్రపంచ వ్యాప్తంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సందడి

Posted: 04/06/2016 06:03 PM IST
Sardaar gabbar singh mania across worldwide

పరిచయం అవసరం లేని పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పేరులో వున్న పవర్... చేసే పనుల్లో మరింత ఎక్కువ కనిపిస్తూ వుంటుంది. నిజాయితీ, మంచితనం, సేవాగుణం, సింప్లిసిటీ... వంటి పలు అంశాలతో భారీ స్టార్ క్రేజ్ ను సొంతం చేసుకొని, జనాల్లో ఒకడిగా.. జనాలకు ఒక్కడిగా వుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్... కానీ స్టార్ స్టేటస్ తో సంబంధం లేకుండా మాములు వ్యక్తిగా బ్రతికే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ఎన్నో కోట్లమంది అభిమానులున్నారు.

అలాంటి పవర్ స్టార్ ప్రస్తుతం అందరిలో పండగ వాతావరణాన్ని వారం రోజుల ముందు నుంచే క్రియేట్ చేసాడు. ఏప్రిల్ 8వ తేదిన తెలుగు సంవత్సరాది ఉగాది. అలాంటి పండగ కానుకగా పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా, అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. దీంతో వారం రోజుల ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించే చర్చలు సాగిస్తున్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ కు ట్యూన్ అవ్వాలి లేదా ఫ్యాన్ అవ్వాలి

ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నెలగా చెప్పుకునే విధంగా మారిపోయింది. ఎక్కడ చూసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పోస్టర్లు, కటౌట్లు... ఎవరి నోట విన్నా కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయాలే. ఇక అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. కానీ పవన్ యాంటీ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. ఈ హడావిడి కేవలం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే కాదు. హిందీ, తమిళ సినీ ఇండస్ట్రీలతో పాటు విదేశాల్లో కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సందడి భారీ ఎత్తున జరుగుతున్నాయి.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం భాషలలో కూడా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వస్తున్నాడని.. ఇతర సినిమాలు తమ విడుదల తేదిని వాయిదా వేసుకోవడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్ర హిందీ ట్రైలర్ కు భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలు హిందీలోకి డబ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కు నార్త్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. దీంతో తొలిసారిగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

తెలుగు ప్రజలు కొత్త సంవత్సరంగా భావించే ఉగాది రోజున ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల కానుంది. కానీ ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నెలగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ప్రోమోలు, పాటలు, వీడియోలకు అభిమానులు ఫుల్ జోష్ లో వున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యి, రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. ఇక తాజాగా విడుదలైన రొమాంటిక్, యాక్షన్, డైలాగ్ ప్రోమోలు ఈ సినిమాపై వున్న అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. దీనికి తోడు బెన్ఫిట్ షోల సందడి మతిపోగొడుతోంది.

గతకొద్ది కాలంగా బెన్ఫిట్ షోలను రెండు మూడు థియేటర్లకు మాత్రమే పరిమితం చేస్తే... ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు మాత్రం దాదాపు అన్నిచోట్ల బెన్ఫిట్ షోలకు అనుమతి లభించినట్లుగా తెలుస్తోంది. అసలే పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ, బిజెపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల నుంచి మంచి సంబంధం వుంది. దీంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర బెన్ఫిట్ షోలకు అనుమతులు లభించినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక సెంటర్లలో బెన్ఫిట్ షోలను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలైన మొదటిరోజే కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నారు.

‘సర్దార్’పై బెట్: నగ్నంగా పరిగెత్తుతానంటున్న బాలీవుడ్ కమెడియన్

ఇక ఈ చిత్రాన్ని 42 దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1400 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ‘పవర్‘ ఫేం బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.

ఇందులో పవన్ కళ్యాణ్, రాయ్ లక్ష్మీల కాంబినేషన్లో వచ్చిన ‘తోబ తోబ..’ సాంగ్ ప్రస్తుతం దుమ్మురేపుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ట్రైలర్లోనే సినిమా స్టోరీని చెప్పేయడంతో.. సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. మరి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎలాంటి రికార్డుల క్రియేట్ చేయనున్నాడో మరో రెండు రోజుల్లో తెలియనుంది.

- Sandy

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Sardaar Gabbar Singh  Benfit shows  Tickets  Bookings  Pawan kalyan  posters  

Other Articles