Sardaar Gabbar Singh | Tickets | Bookings | Benfit shows | Pawan kalyan

Sardaar gabbar singh tickets

Sardaar Gabbar Singh Tickets Bookings, Sardaar Gabbar Singh bookings, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

Sardaar Gabbar Singh Tickets: Powerstar Pawan kalyan Sardaar Gabbar Singh film Advance Tickets Booking started. Sharath marar, sunil lulla producers, DSP Music.

దుమ్మురేపుతున్న సర్దార్ టికెట్ల ధరలు

Posted: 04/06/2016 11:52 AM IST
Sardaar gabbar singh tickets

ఒకవైపు మండే ఎండలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా వల్ల తెలుగు ప్రజల్లో వాతావరణం వేడెక్కిపోతుంది. సినీ జనాలు ఈ సినిమా టికెట్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. అసలే పవన్ కళ్యాణ్ క్రేజ్ ను దృష్టిలో వుంచుకొని చిత్ర నిర్మాతలు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషలలో కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలకు సిద్ధమయ్యాడు.

తమ అభిమాన హీరో సినిమాను మొదటిరోజే చూడాలని అభిమానులు ఎంతగానో ఆరాటపడుతుంటారు. టికెట్ల కోసం ఎంత ఖర్చు అయినా పెడుతుంటారు. కానీ ఓ అభిమాని మాత్రం ఏకంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టికెట్ల కోసం 10లక్షల విలువ చేసే ఇల్లును అమ్మేసి టికెట్లు కొన్నాడట. కర్నూల్ జిల్లాలోని ఓ అభిమాని ఇలా టికెట్ల కోసం 10లక్షలు విలువ చేసే ఇల్లు అమ్మేసి టికెట్లు కొన్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఈ విషయం విన్న తోటి అభిమానులు షాక్ కు గురవుతున్నారు. అయితే ఈ విషయం ఇంకా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు కానీ.. మొత్తానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టికెట్ల విషయంలో ప్రస్తుతం రచ్చ రచ్చ జరుగుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న థియేటర్ల వద్ద టికెట్ల కొరత ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల ముందుగానే బడా బాబులు టికెట్లను సొంతం చేసుకొని, భారీ రేటుకు బ్లాక్ లో టికెట్లను విక్రయిస్తున్నారు.

ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజులో అదరగొడుతున్నాయి. ఈ సినిమాకు వున్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ యాజమాన్యాలు కూడా టికెట్ల రేటును పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు చోట్ల టికెట్ ధర పెంపుకోసం థియేటర్ల యాజమాన్యాల నుంచి అప్లికేషన్ వెళ్లినట్లుగా తెలిసింది. మొత్తానికి ‘సునామి బాధితులకు పులిహోర పోట్లాలు దొరికితే ఎలా వుంటుందో.... ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టికెట్లు దొరికితే అలా వుంటుంది’ అనే పరిస్థితి ఏర్పడింది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  Tickets  Bookings  Pawan kalyan  posters  

Other Articles