Horlicks put on sale, who will be interested? హార్లిక్స్ ను దక్కించుకునే పోటీలో నెస్లే, యునిలివర్‌

Gsk may put iconic horlicks for sale to fund 13 billion novartis deal

gloxosmithkline, gsk, horlicks, gsk on horlicks, novartis deal, gsk deal with novartis, billion dollar deal, novartis deal, gsk in india, pharma in india, novartis, billion dollar deal, nestle, Uni Lever, business

British pharma major GlaxoSmithKline Plc is considering selling its near 150-year old health drink Horlicks, even as it looks to fund a $13 billion deal with Novartis. We take a closer look at GSK's rationale for the deal.

అమ్మాకానికి హార్లిక్స్.. రేసులో ముందున్నదెవరో తెలుసా.?

Posted: 03/28/2018 08:56 PM IST
Gsk may put iconic horlicks for sale to fund 13 billion novartis deal

భారతీయ మార్కెట్లో చెరగని ముద్ర వేసుకున్న హెల్త్ డ్రింక్‌ హార్లిక్స్ ను విక్రయించాలని గ్లాక్సో స్మిత్‌ క్లిన్‌ (జీఎస్కే) రమారమి సమాయత్తం అయ్యింది. హెల్త్ కేర్‌పై పూర్తిగా దృష్టిపెట్టేందుకు హార్లిక్స్‌ బ్రాండ్ ను అమ్మేస్తున్నట్లు సమాచారం. దీంతో జీఎన్‌కే నుంచి హార్లిక్స్ ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు నెస్లే, యునిలివర్‌ వంటి సంస్థలు రేసులో ముందున్నట్లు కూడా తెలుస్తుంది. బ్రిటన్ కు చెందిన గ్లాక్సో స్మిత్‌ క్లిన్.. కొన్ని దశాబ్దాల క్రితం హార్లిక్స్‌ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1873లో తొలసారిగా దీని విక్రయాలు చేపట్టారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌ సైనికులతో పోరాడిన భారత సైనికులు హార్లిక్స్‌ బ్రాండ్ ను భారత్ కు తీసుకొచ్చారు. అలా మన దేశంలో ఈ బ్రాండ్ కు మంచి పేరుంది.

ఇక మనదేశ ప్రజలతో పెనవేసుకున్న బంధం నేపథ్యంలో జీఎస్‌కే లాభాల్లో అధిక వాటా హార్లిక్స్ దే కావటం గమనార్హం. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం.. జీఎస్కేలో హార్లిక్స్‌ వాటా విలువ 3.1బిలియన్‌ డాలర్లకు పైమాటే. అయితే ఇటీవల జీఎస్కే నోవార్టీస్‌లో వాటా కొనుగోలు చేసింది. ఇందులో పెట్టుబడుల కోసం హార్లిక్స్‌, ఇతర పోషక ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ విక్రయం ద్వారా దాదాపు 4 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.26వేల కోట్లు)  వస్తాయని సంస్థ భావిస్తోంది. కాగా దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gsk  horlicks  novartis deal  novartis  billion dollar deal  nestle  Uni Lever  business  

Other Articles