Mi A1 discontinued in India as Xiaomi set to launch Mi A2 షియోమీ నుంచి త్వరలోనే ఎంఐ ఏ2, ఎంఐ 6 ఎక్స్

Xiaomi mi a1 goes out of stock in india but company says not discontinued

xiaomi mi a1, xiaomi mi a1 discontinued in india, mi a2, xiaomi mi a2, xiaomi mi a2 price in india, xiaomi mi 6x, mi 6x specifications, mi 6x price, android one, xiaomi, mi, mobiles, e-commerce, smart phones, mobiles, technology, business

Xiaomi Mi A1 has not been discontinued in India, according to the company. There were reports which claimed Mi A1 had been discontinued for India.

షియోమీ నుంచి త్వరలోనే ఎంఐ ఏ2, ఎంఐ 6 ఎక్స్

Posted: 04/16/2018 04:51 PM IST
Xiaomi mi a1 goes out of stock in india but company says not discontinued

చైనా కంపెనీ షియోమీ నుంచి త్వరలోనే రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లు భారతీయ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఎంఐ ఏ1కు సస్సెసర్గా ఎంఐ ఏ2ను త్వరలోనే తీసుకువస్తుందన్న సంకేతాలను ఇప్పటికే ఇచ్చేసింది. ఇక దీనికి తోడు ఎంఐ 6ఎక్స్ ను కూడా ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే షియోమీ సంస్థ విడుదల చేసిన ఎంఐ ఏ1 ఫోన్ల విక్రయాలను నిలిపేసిందని, అయితే దీనికి కొనసాగింపుగా ఎంఐ ఏ2 ను తీసుకురానున్నట్లు సమాచారం. ఎంఐ ఏ2 స్మార్ట్ ఫోన్ కూడా 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ సామర్థ్యంతో పాటు అండ్రాయిడ్ 8.1 ఓరియో వర్షన్ తో రానున్నట్లు సమాచారం.

అయితే ఏడు మాసాల క్రిందటే విడుదల చేసిన ఎంఐ ఏ1 ఫోన్లను ఇప్పటికే షియోమీ సంస్థ నిలిపేసిందన్న వార్తలు వినబడుతున్నా.. వాటిని సంస్థ ఖండించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తాము ఫోన్ అమ్మాకాలను నిలిపివేయలేదని అయితే ఈ పోన్లకు విపరీతమైన డిమాండ్ వున్న నేపథ్యంలో అవి హాట్ కేకుల్లా అయిపోయాయని దీంతో స్టాక్ లేదని చెప్పింది. అందుచేతనే తాము ఈ కామర్స్ సైట్లతో ఎక్కడా అమ్మాకాల కోసం సమాచారం అందుబాటులో పెట్టలేదని సంస్థ వర్గాలు తెలిపాయి. స్టాక్ అందుబాటులోకి రాగానే అమ్మకాలు పునారవృత్తం అవుతాయని చెప్పారు.

ఇక ఇదే తరహాలో ఎంఐ 5 ఎక్స్ కు కూడా సస్సెసర్ గా ఎంఐ 6 ఎక్స్ ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 25న దీనిని మార్కెట్లో అవిష్కరించాలని సంస్థవర్గాలు భావిస్తున్నాయని సమాచారం. ఈ మేరకు ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం అందుబాటులో లేదు. అయితే ఎంఐ 6 ఎక్స్ ఎలావుండబోతుందన్న సమాచారం కూడా లీక్ అయ్యింది. రమారమి ఆరు అంగుళాలోలో ఫుల్ హెచ్ డి డిస్ ప్లేతో 4జీబి ర్యామ్ 32 జీబి మెమోరీ ఒక వేరియంట్ తో పాటుగా 6జీబి ర్యామ్ 64 జీబి మెమోరీతో మరో వేరియంట్, ఇక మూడో వేరియంట్ 6 జీబి ర్యామ్ తో పాటు 128 జీబి మెమోరీతో మూడు వేరియంట్లలో లభ్యం కానుందని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : xiaomi  mi a1  mi a2  xiaomi mi 6x  mi 6x specifications  mobiles  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles