World's first flying bike makes its debut in US auto show ప్ర‌పంచంలో తొలి ఫ్లైయింగ్ బైక్.. త్వరలో అమెరికాలోకి ఎంట్రీ.!

Speeder bike from star wars world s first flying bike makes debut in us auto show

Detroit Auto Show, XTURSIMO, flying motorcycle, hoverbike, flying bikes, flying bike, hover bike, world first flying bike, flying bike in US, Technology

A flying bike made by Japanese startup AERWINS Technologies made its debut in the United States on Thursday at the Detroit Auto Show. Touted as the world's first flying bike, the hoverbike drew sharp comparisons to the bikes of the popular Star Wars. The manufacturers have plans to launch the model next year.

ప్ర‌పంచంలో తొలి ఫ్లైయింగ్ బైక్.. డెట్రాయిట్ అటో షోలో సందడి.!

Posted: 09/16/2022 01:40 PM IST
Speeder bike from star wars world s first flying bike makes debut in us auto show

ప్ర‌పంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సంద‌డి చేసింది. జ‌ప‌నీస్ స్టార్ట‌ప్ ఏర్‌విన్స్ టెక్నాల‌జీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపుల‌ర్ స్టార్ వార్స్ బైక్స్‌ను త‌ల‌పిస్తున్న ఈ బైక్‌ను కంపెనీ ఎక్స్‌రిస్మో హోవ‌ర్‌బైక్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ మోడ‌ల్‌ను లాంఛ్ చేసేందుకు ఏర్‌విన్స్ స‌న్నాహాలు చేప‌డుతోంది. హోవ‌ర్‌బైక్ గంట‌కు వంద కిలోమీట‌ర్ల వేగంతో 40 నిమిషాల పాటు ప్ర‌యాణిస్తుంది. జ‌పాన్‌లో ఫ్లైయింగ్ బైక్ ఇప్ప‌టికే సేల్‌లో ఉంది. 2023లో స్మాలర్ వెర్ష‌న్‌ను అమెరికాలో విక్ర‌యించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని ఏర్‌విన్స్ వ్య‌వ‌స్ధాప‌క సీఈవో షుహి కొమ‌ట్సు వెల్ల‌డించారు.

అయితే హోవ‌ర్‌బైక్ ధ‌ర రూ 6 కోట్లు పైమాటే. చిన్న ఎల‌క్ట్రిక్ మోడ‌ల్ ధ‌ర‌ను త‌క్కువ ధ‌ర‌కు అందిస్తామ‌ని, అయితే ఇది మ‌రో మూడేండ్ల‌లో 2025 నాటికి సిద్ధ‌మ‌వుతంద‌ని చెప్పారు. హోవ‌ర్‌బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన డెట్రాయిట్ ఆటో షో కో చీఫ్ టాడ్ సాట్ ఇది మ‌ర‌పురాని అనుభూతిని మిగిల్చింద‌ని, చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంద‌ని, సైఫీ మూవీ స‌న్నివేశంలా అనిపించిద‌ని అన్నారు. తాను 15 ఏండ్ల బాలుడిలా ఫీల్ అయ్యాన‌ని, తాను స్టార్ వార్స్‌ను బ‌య‌ట‌కు వ‌చ్చి వారి బైక్‌పై జంప్ చేసిన‌ట్టు అనిపించింద‌ని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles