Nokia 1 is a Stylish Budget Phone నోకియా-1 బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. రేపటి నుంచే అమ్మాకాలు ప్రారంభం..

Nokia 1 android oreo go edition smartphone launched in india

nokia, nokia 1, nokia 1 android go, nokia 1 india price, nokia 1 specifications, e-commerce, smart phones, mobiles, technology, business

HMD Global today launched the Nokia 1 Android Oreo (Go Edition) smartphone in India, roughly a month after its official unveiling at MWC 2018 last month.

నోకియా-1 బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. రేపటి నుంచే అమ్మాకాలు ప్రారంభం..

Posted: 03/27/2018 06:43 PM IST
Nokia 1 android oreo go edition smartphone launched in india

ఫీచర్డ్ ఫోన్ల సమయంలో తన హావాను కొనసాగించిన నోకియా.. తాజాగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలలో కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మోడళ్లను విడుదల చేసిన హెఛ్ఎండి తాజాగా తక్కువ ధరకు అందరి చెంత వుండేలా బేసిక్ స్థాయిలో నోకియా 1 పేరుతో అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ గో ఓఎస్ తో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. దీని ధర రూ.5,499. బుదవారం అంటే మార్చి 28 నుంచే దేశీయ విఫణిలో దీని అమ్మాకాలు ఆరంభం కానున్నాయి.

గత నెలలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్ 2018 సదస్సులో ఈ ఫోన్ ను కంపెనీ ఆవిష్కరించిన విషయం గుర్తుండే ఉంటుంది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీనికి అదనంగా అజూర్ గ్రే, యెల్లో, పింక్ కలర్స్ తో కూడిన మూడు కవర్లను ప్రత్యేకంగా రూ.450 ధరకు విక్రయించనుంది. యూజర్లు తరచూ కవర్ మార్చుకుంటూ కొత్త దనాన్ని ఆస్వాదించొచ్చు.

ఆండ్రాయిడ్ గో వెర్షన్ సాఫ్ట్ వేర్ అన్నది ప్రారంభ స్థాయి మోడళ్లలోనూ వేగంగా నెట్, యాప్స్ ను వినియోగించుకునేందుకు వీలు కల్పించేది. నోకియా 1 ఫోన్లో 4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే, 1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 5 మెగా పిక్సల్స్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్స్ ముందు కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8జీబీ స్టోరేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. 4జీ వోల్టేకు సపోర్ట్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles