Toyota Urban Cruiser Hyryder top variants launched మార్కెట్‌లోకి టోయోటా నుంచి అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్‌.. వాటికి సవాలే.!

Toyota urban cruiser hyryder top variants launched prices and specifications

urban cruiser hyryder, urban cruiser hyryder Variants, urban cruiser hyryder prices, urban cruiser hyryder specifications, toyota hyryder vs hyundai creta, toyota, kia seltos, hyundai, hyryder, Auto news India, Auto news, Cars, Bikes, Automobile news, Electric Vehicles news

Toyota has finally revealed the prices of the top variants of the all-new Toyota Urban Cruiser. Prices announced for eDrive 2WD Hybrid variants of the V, G, and S variants and the 2WD Neo Drive V variant. The SUV will be available in four variants: E, S, G, and V and in two powertrains – Neo Drive and self-charging strong hybrid electric.

మార్కెట్‌లోకి టోయోటా నుంచి అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్‌.. వాటికి సవాలే.!

Posted: 09/10/2022 07:13 PM IST
Toyota urban cruiser hyryder top variants launched prices and specifications

పండుగ‌ల సీజ‌న్‌లో క‌స్ట‌మ‌ర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూట‌ర్లు కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతారు. ఈ ఏడాది పండుగ‌ల సీజ‌న్‌లో భార‌తీయుల‌ కొనుగోలుదారుల మ‌న‌స్సు దోచేందుకు అన్ని కార్ల త‌యారీ సంస్థ‌లు సిద్ధం అవుతున్నాయి. పలు సంస్థలు భవిష్యత్తును శాసించే విద్యుత్ కార్లలోని కొత్త మోడళ్లను ప్రదర్శించేందుకు సిద్దం కాగా మరికొన్ని సంస్థలు సంప్రదాయబద్దంగా వస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంధనంతో నడిచే కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా తన తొలి ఈవీ ఎస్యూవీని ప్రదర్శించగా, ఇక టాటీ కూడా మరో విద్యుత్ కారును అందుబాటులోకి తీసుకురానుంది.

ఇక ఆ జాబితాలో ట‌యోటా కిర్లోస్క‌ర్ కూడా చేరిపోయింది. టోయోటా మాత్రం తన సంప్రదాయ ఇంధన కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజాగా కార్ల వినియోగ‌దారులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అర్బ‌న్ క్రూయిజ‌ర్ హై రైడ‌ర్ మోడ‌ల్ కారు మార్కెట్‌లో తీసుకొచ్చింది. ఈ కారు నాలుగు వేరియంట్ల‌లో వినియోగ‌దారుల‌కు ల‌భ్యం అవుతుంది. రూ.15.11 ల‌క్ష‌ల నుంచి రూ.18.99 ల‌క్ష‌ల మ‌ధ్య ఈ కారు వినియోగదారుల‌కు అందుబాటులోకి వ‌స్తున్న‌ది. గ‌త జూలైలోనే దీన్ని ట‌యోటా ఆవిష్క‌రించింది. ఇది హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌తోపాటు త్వ‌ర‌లో మార్కెట్‌లోకి రానున్న మారుతి గ్రాండ్ విటారా వేరియంట్ కార్ల‌తో త‌ల ప‌డ‌నున్న‌ది.

సెల్ఫ్‌ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రీడ్ ప‌వ‌ర్ ట్రైన్‌తోపాటు అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ నియో డ్రైవ్ కారు అందుబాటులో ఉంటుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్‌, వెహిక‌ల్ స్టెబిలిటీ కంట్రోల్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ట‌చ్ స్క్రీన్‌, వైర్‌లెస్ చార్జ‌ర్‌, ఏడంగుళాల డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, ఐ-క‌నెక్ట్ క్రూయిజ్ కంట్రోల్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి. ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్‌లో రెండు ఇంజిన్ చాయిస్‌లు ఆఫ‌ర్ చేస్తున్నారు. ట‌యోటా డెవ‌ల‌ప్ చేసిన లీట‌ర్ టీఎన్‌జీఏ అట్కిన్‌స‌న్ సైకిల్ ఇంజిన్ 92 హార్స్‌ప‌వ‌ర్‌, 122 ఎన్ఎం టార్చ్ వెలువ‌రిస్తుంది. న్యూ బ్రెజాలో మారుతి సుజుకి వాడుతున్న 1.5 లీట‌ర్ల కే15సీ మైల్డ్ హైబ్రీడ్ ఇంజిన్ కూడా ఇందులో ల‌భిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles