ఢిపెన్స్ కాంట్రాక్టు కోసం లంచాలు.. బిబిసీ రట్టుచేసిన రోల్స్ రాయిస్ గుట్టు Rolls Royce paid £10 million to Indian defence agent: Report

Rolls royce paid 10 million to indian defence agent report

Air India, Sudhir Choudhrie, Rolls Royce, Indian Air Force, hawk aircrafts

British defence major Rolls Royce+ made 'secret payments' of around £10 million to an Indian defence agent that may have helped the company to win a big contract for engines on Hawk aircrafts

ఢిపెన్స్ కాంట్రాక్టు కోసం లంచాలు.. బిబిసీ రట్టుచేసిన రోల్స్ రాయిస్ గుట్టు

Posted: 11/01/2016 10:09 PM IST
Rolls royce paid 10 million to indian defence agent report

భారత రక్షణ ధళంలో బోపోర్స్ కుంభకోణం తరువాత చిన్న, చితక స్థాయిలో కూడా అడపాదడపా అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. అయితే తాజాగా వెలుగుచూసిన ఇండియన్ నేవీకి సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారం మాత్రం పెను సంచలనంగా మారింది. లంచాలను ఎరగా వేసి.. భారత వైమానిక దళానికి చెందిన పెద్ద కాంట్రాక్టులను విదేశీ సంస్థ దక్కించుకుందన్న వార్తలు తీవ్ర సంచలనాలకు కారణమవుతున్నాయి.

బిబీసీ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియన్ నేవీకి చెందిన భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు బ్రిటీష్ ఢిపెన్స్ కు చెందిన రోల్స్ రాయిస్ అనే సంస్థ 81 కోట్ల రూపాయల లంచాన్ని భారత్ అధికారులకు చెల్లించింది. ఇ:డియన్ ఆర్మీలోని హాక్ ఎయిర్ క్రాఫ్ట్ లలో వినియోగించే ఇంజన్లు ఈ సంస్థ దక్కించుకునేందుకు ఇంతపెద్ద మొత్తంలో డీల్ కుదర్చుకుందని పేర్కోంది. ఈ డీల్స్ ఒప్పందంలో భారత్ కు చెందిన అయుధ డీలర్ సుధీర్ చౌదరీ ప్రమేయముందన్న కథనాన్ని బిబిసీ ప్రచురించింది.

నల్లకుబేరుల జాబితాలో వున్న సదరు ఆయుధ డీలర్ ప్రస్తుతం లండన్ లో స్థిరపడ్డాడని, అక్రమంగా నిధుల మళ్లింపు విషయంలో, నల్లధనాన్ని కలిగి వున్న అభియోగాల నేపథ్యంలోనే అయన లండన్ తాత్కాలిక అవాసం పోందుతున్నాడని కూడా తెలిపింది. అయితే నల్లధన కుబేరుల జాబితాలో వున్న వారితో, సంస్థలతో ఏదైనా వ్యవహారాలు జరిపే క్రమంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది.

కాగా రోల్స్ రాయిస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడవుతోంది. సీక్రెట్గా ఏజెంట్స్ను నియమించుకుని లాభాదాయకమైన భూ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వారికి లంచాలు కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. గార్డియన్, బీబీసీ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాభాలు పెంచుకోవడానికి అక్రమ చెల్లింపుల పద్ధతిని అనుసరించి రోల్స్ రాయిస్ ప్రయోజనాలు పొందిందని బీబీసీ, గార్డియన్లు తెలిపాయి.

ల్యాండ్ కాంట్రాక్టులు పొందడానికి కూడా ఏజెంట్లు అక్రమ చెల్లింపులకు తెరతీశారని సంస్థ అంతర్గత వ్యక్తులు చెబుతున్నారు.  ఈ విషయంపై అమెరికా, బ్రిటన్ అవినీతి నిరోధక ఏజెన్సీలు నెట్వర్క్ ఏజెంట్లను విచారించడం ప్రారంభించాయి. 13 బిలియన్ పౌండ్ల(రూ.1,06,125కోట్లకు పైగా) విలువ కలిగిన టర్బైన్లను, ఇంజన్లను ప్యాసెంజర్, మిలటరీ ఎయిర్క్రాప్ట్లకు విక్రయించిన రోల్స్ రాయిస్ వాటిపై మాత్రం పూర్తి వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తోంది.

బ్రెజిల్, భారత్, చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అంగోలా, ఇరాక్, ఇరాన్, కజాఖ్స్తాన్, అజర్బైజాన్, నైజీరియా, సౌదీ అరేబియాలలో రోల్స్ రాయిస్ ఏజెంట్లను నియమించుకుని ఈ అక్రమాలకు పాల్పడిందని బీబీసీ రిపోర్టు చేసింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న విచారణకు తాము సహకరిస్తామని, కానీ మధ్యవర్తిత్వలు పాల్పడిన అవినీతి, లంచాలకు సంబంధించిన విషయాలు మాత్రం సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు, ఇతర అథారిటీలు విచారిస్తాయని దాటవేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India  Sudhir Choudhrie  Rolls Royce  Indian Air Force  hawk aircrafts  

Other Articles