లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 8700 మార్కుకు దిగువన నిఫ్టీ Sensex, Nifty close with marginal gains

Sensex ends two day losing spree led by gains

Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Sensex and the Nifty closed with marginal gains, as they stayed under pressure for a large part during the trading session after falling nearly 104 points in early trade

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 8600 మార్కుకు ఎగువన నిఫ్టీ

Posted: 10/27/2016 06:17 PM IST
Sensex ends two day losing spree led by gains

తీవ్ర ఒడిదోడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ముగింపు సమయానికి స్వల్ప లాభాలను అందుకున్నాయి. అక్టోబర్ ఎఫ్ అండ్ ఓ రోజున మద్యాహ్నం నుంచి ముగింపు సమయం వరకు మదుపరుల సెంటిమెంట్ కారణంగా మార్కెట్లు స్వల్పంగా లాభించాయి. ట్రేడర్లు తాజా పోజిషన్లు తీసుకోవడంతో బెంచ్ మార్క్ సూచీలు నష్టాల నుంచి లాభాల బాటలోకి పయనించాయి. దీనికి తోడు రెండో త్రైమాసిక ఫలితాలు కూడా ఆశాజక ఫలితాలను వెలువరించడంతో అవి కూడా మార్కెట్లను లాభాల బాటలోకి తీసుకెళ్లాయి. ఈ క్రమంలో గత రెండు రోజుల వరుస నష్టాలను చవిచూసిన మార్కెట్లు ఇవాళ లాభాలను అర్జించాయి,

విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో మార్కట్లు లాభాలను అర్జించేందుకు మదుపరుల సెంటిమెంట్ కారణమైంది. ఈక్విటీ బెంచ్ మార్కులతో చిన్న, మద్య తరహా సహా పెద్ద బెంచ్ మార్కెట్లు కూడా లాభాలను అర్జించడంతో దేశీయ సూచీలు ఇవాళ లాభాలను అర్జించాయి. ఉదయం ప్రారంభంలో నిన్నటి క్లోజింగ్ తో పోల్చిగా, వంద పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్ చివరకు 28 వేల మార్కుకు చేరువలో ముగియగా, నిఫ్టీ కూడా కీలకమైన 8600 మార్కుకు ఎగువన ముగిసింది.

ఈ క్రమంలో మొత్తంగా 1601 సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, 1063 సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. అక్టోబర్ మాసం మొత్తంగా పరిశీలిస్తే సెన్సెక్స్ 0.2శాతం లాభాన్ని అర్జించగా, నిఫ్టీ 0.3 శాతం లాభాన్ని అర్జించింది. కాగా కీలక సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అటో, మిడ్ క్యాప్ నిఫ్టీ, మిడ్ క్యాప్, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య, బీఎస్ఈ కన్జూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. కాగా, బ్యాకింగ్ నిఫ్టీ, ఎఫ్ ఎం జీ సీ, హెల్త్ కేర్ సూచీలు మాత్రమే స్వల్ప లాభాలను అందుకున్నాయి.

ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్ తదితర సంస్థల షేర్లు అధ్యధిక లాభాలను అర్జించగా, ఇన్ ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో కార్ప్, యస్ బ్యాంక్, జడ్ఈఈఎల్ తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles