మూడు నెలల కనిష్టస్థాయికి మార్కెట్లు.. 8550 మార్కుకు దిగువన నిఫ్టీ.. Sensex ends at 3-month low; auto, capital goods stocks skid

Sensex ends at 3 month low auto capital goods stocks skid

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

the BSE Sensex ended with a loss of 144 points at 27,530. The BSE Sensex opened at 27,776 touched an intra-day high of 27,803 and low of 27,488.

మూడు నెలల కనిష్టస్థాయికి మార్కెట్లు.. 8550 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 10/17/2016 09:03 PM IST
Sensex ends at 3 month low auto capital goods stocks skid

దేశీయ మార్కెట్లను మళ్లీ నష్టాలలో ముంచెత్తాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల కారణంగా మార్కెట్లు తిరోగమనంలో పయనించాయి, ముఖ్యంగా ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు మార్కెట్లను 14 వారాల కనిష్టస్థాయికి తీసుకెళ్లాయి. మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి, సెన్సెక్స్ సుమారు 63 పాయింట్ల లాభంతో పయనించగా, అటు నిఫ్టీ కూడా సుమారు 6 పాయింట్ల లాభంతో ముందుకు సాగింది. దీంతో ఇవాళ ట్రేడింగ్ సాగించిన మొత్తం షేర్లలో 1513 సంస్థల షేర్లు నష్టాలు ముంచెత్తగా, 1298 సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించాయి.

సరిగ్గా 11 15 నిమిషాల నుంచి ఐరోపా మార్కెట్లు నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో మార్కెట్లు తిరోగమనం దిశగా పయనించాయి. దీంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి, ముగింపు సమయానికి మార్కెట్లను నష్టాలను పలుకరించాయి, సెన్సెక్స్ 144 పాయింట్ల నష్టంతో 27,530 వద్ద,  నిఫ్టీ 63  పాయింట్ల నష్టంతో 8,520వద్ద  క్లోజ్ అయ్యాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలు ముంచెత్తాయి. బ్యాంకింగ్‌  రంగం స్పల్పంగా లాభపడగా  ఆటో క్యాపిటల్ గూడ్స్  షేర్ల నష్టాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి.  ఫార్మా, ఐటీ నష్టాల్లో ముగిశాయి.

ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ సంస్థల షేర్లు లాభాలను అర్జించాయి, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను చవిచూశాయి. కాగా అటో, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, మెటల్స్, మధ్య తరహా సమాఖ్య , మద్యతరహా నిఫ్టీ సూచీలు భారీ నష్టాలను ఎదుర్కోగా, మిగిలిని అన్ని సూచీలు కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ క్రమంలో  ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఐటీసీ తదితర సంస్థలు అత్యధిక లాభాలను కురిపించగా, జీ ఎంటర్ టైన్ మెంట్ టాప్ లూజర్ గా నిలవగా ఐడియా, బాష్‌, అంబుజా సిమెంట్‌, ఎంఅండ్‌ఎం, ఐషర్‌ మోటార్స్, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌, ఏసీసీ, హీరో మోటో తదితర సంస్థల షేర్లు క్షీణించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles

Today on Telugu Wishesh