మూడు నెలల కనిష్టస్థాయికి మార్కెట్లు.. 8600 మార్కుకు దిగువన నిఫ్టీ.. Sensex at 3-month low, crashes 439 points on global sell-off

Sensex at 3 month low crashes 439 points on global sell off

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Indian stocks tumbled like nine pins with the benchmark Sensex plunging over 439 points to close at a three-month low of 27,643.11 after a slew of global factors such as weak Chinese export data and Fed rate hike talks unnerved investors.

మూడు నెలల కనిష్టస్థాయికి మార్కెట్లు.. 8600 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 10/13/2016 09:59 PM IST
Sensex at 3 month low crashes 439 points on global sell off

దేశీయ మార్కెట్లు భారీ నష్టాలలో ముగిసాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల కారణంగా మార్కెట్లు తిరోగమనంలో పయనించాయి, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ పరపతి విధానాన్ని సమీక్షించనుందన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లను నష్టాలను ముంచెత్తాయి,  ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచాలతో దలాల్ స్ట్రీట్ లో అందోళన నెలకొంది. దీంతో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభం నుంచీ బలహీనంగా ఉన్న ట్రేడ్ అయిన మార్కెట్లు యూరప్ మార్కెట్ల నెగిటివ్  ఓపెనింగ్ తో మరింత పతనమయ్యాయి.

ఫెడ్ రిజర్వు వడ్డీ పరపతిని తగ్గిస్తుందన్న వార్తలతో మదుపుదారులు అమ్మాకాలకు మొగ్గుచూపారు. దీంతో ఉదయం ప్రారంభంతోనే మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి, ఉదయం సెన్సెక్స్ 135 పాయింట్ల మేర నష్టాల ముందెత్తగా, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంద, కాగా అమ్మాకాల ఒత్తిడితో మార్కెట్లు ముగింపు సమయానికి భారీ నష్టాలను పలుకరించాయి, సెన్సెక్స్ 439 పాయింట్ల నష్టంతో 27,643 వద్ద,  నిఫ్టీ135  పాయింట్ల నష్టంతో 8,573వద్ద  క్లోజ్ అయ్యాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలు ముంచెత్తాయి.

ఈ నేపథ్యంలో అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మెటల్స్ మినహా అన్ని సూచీలు నష్టాల బాటలోనే పయనించాయి. అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, ఐటీ, టెక్నాలజీ, చిన్న తరహా, మద్య తరహా పరిశ్రమల సమాఖ్య, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య నిఫ్టీలతో పాటు క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ సూచీలు కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి, ఈ క్రమంలో గెయిల్, బిపిసిఎల్; గ్రాసిమ్, రిలయన్స్, హెచ్ యు ఎల్ తదితర సంస్థలు అత్యధిక లాభఆలను కురిపించగా,  బ్యాంక్ అప్ బరోడా, ఎన్టీపిసీ, సిప్లా, జీ ఎంటర్నైమెంట్, పవర్ గ్రిండ్ కార్పోరేషన్  తదితర సంస్థల షేర్లు క్షీణించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles

Today on Telugu Wishesh