Sensex sheds 310 pts & Nifty below 8600, Adani Ports up 8%

Sensex slumps 310 points worst fall in over 6 weeks

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Profit booking continued for the second consecutive session Wednesday as the equity benchmarks posted a biggest one-day loss in percentage terms since June 24.

లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు.. నష్టాల్లో మార్కెట్లు

Posted: 08/10/2016 07:22 PM IST
Sensex slumps 310 points worst fall in over 6 weeks

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు ముంచెత్తాయి. మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మిడ్ సెషన్ నుంచి మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ముగింపు సమయానికి ఆరు వారాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 28 వేల మార్కుకు దిగువన చేరగా, అటు నిఫ్టీ కూడా 8600 మార్కుకు దిగువకు జారుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు ముగింపు సమయానికి సెన్సెక్స్ 310 పాయింట్లు నష్టపోయి 27,774 వద్దకు దిగజారగా, అటు నిఫ్టీ 103 పాయింట్లు నష్టంతో 8,575 వద్ద ముగిసింది. ఇవాళ మొత్తంగా 1893 సంస్థల షేర్లు నష్టాల బాటలో పయనించగా, 840 సంస్థల షేర్లు లాభాలను గడించాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ రమారమి అన్ని సూచీలు నష్టాలబాటలోనే పయనించగా, అటో, బ్యాకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీగా నష్టపోయాయి, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ గూడ్ప్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలు టెక్నాలజీ నష్టాలను ఎదుర్కోన్నాయి. మెటల్స్, ఐటీ, టెక్నాలజీ సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, టీసీఎస్‌, యస్ బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, గ్రాసిమ్, ఐడియా సెల్యూలార్, ఏసీసీ, లుపిన్ అంబుజా సిమెంట్స్ తదితర సంస్థల షేర్లు  నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles