Subir Gokarn meets Raghuram Rajan, sets off speculation on possible RBI move

Subir gokarn meets rbi governor raghuram rajan triggers speculation

subir gokarn rbi,rbi governor post,rbi governor appointment,RBI Governor Rajan,rajan replacement at rbi,rajan successor,rbi chief shortlist,arvind panagariya rbi rajan,rajan successors in the race,arundhati bhattacharya rbi,rbi rajan august 9 monetary policy

Subir Gokarn reportedly met outgoing Raghuram Rajan, triggering speculation that the former could be the next Reserve Bank of India governor.

మాజీ ఢిప్యూటీ సుబీర్‌ గోకర్నకే అర్బీఐ గవర్నర్ పగ్గాలు..?

Posted: 08/06/2016 09:57 PM IST
Subir gokarn meets rbi governor raghuram rajan triggers speculation

భారతీయ రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్ గా ఎవర్ని ఎంపిక చేయనున్నారనే వార్త మరోసారి ప్రముఖంగా నిలిచింది. ప్రస్తుత అర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌ వారసులుగా ఎవర్ని కేంద్రం ఎంపిక చేయనుందన్నదే అసలు విషయం. రఘురాం తర్వాత ఎంపికయ్యే వ్యక్తి భారత దేశ అర్థిక పరిస్థితిని గాడిన పెట్టగల సమర్థులా..? అలాంటి వారిని కేంద్రం ఎంపిక చేసిందా..? తాజాగా ఈ విషయంలో మీడియాలో వస్తున్న ఊహాగానాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్‌ గోకర్న రాజన్తో సమావేశం కావడంతో ఆయనే తదుపరి అర్బీఐ గవర్నర్ గా వ్యవహరించనున్నారా.. అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్  ప్రచురించింది.  
 
ఆర్బిఐ కదలిక చర్చకు దారితీసింది.  దేశంలోని అగ్రశ్రేణి ఆర్థిక సంస్థ,  దేశ కేంద్ర బ్యాంక్ గవర్నర్ ఆయనే అనే అంచనాలు హాట్ టాపిక్  గా మారాయి. కాగా రాజన్‌ పదవీకాలం పూర్తి కాకముందే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేది వెల్లడిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఎలాంటి వూహాగానాలకు తావులేదని ఇప్పటికే ఎంపిక ప్రక్రియ మొదలయ్యిందని వెల్లడించాయి. అలాగే నూతన గవర్నర్‌ ఎంపికకు ఎలాంటి ప్యానెల్‌ను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశాయి. అటు సెప్టెంబరు 4వ తేదీతో రాజన్‌ పదవీ కాలం ముగియనుండటంతో ఆయన తన పదవికి వీడ్కోలు పలకనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subir Gokarn  meeting  Raghuram Rajan  Indian Economy  RBI Governor  

Other Articles