ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో గూగుల్ తాజా వెర్షెన్ 7.0 నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ తమదేనంటూ తన కొత్త స్మార్ట్ఫోన్ వీ20 మొదటి ఫీచర్ను విడుదల చేసిన ఎల్జీ, మరో ఫీచర్ను రివీల్ చేసేసింది. తన కొత్త స్మార్ట్ఫోన్ వీ20 క్వాడ్ డాక్ ఫీచర్తో రాబోతుందని వెల్లడించింది. అయితే ఆ ఫీచర్తో రాబోతున్న ప్రపంచపు తొలి స్మార్ట్ఫోన్ కూడా తమదేనని ప్రకటించింది. 32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్ మెరుగైన ఆడియో, నాయిస్ ఫిల్టరింగ్ను కలిగిఉంటుందని ఎల్జీ పేర్కొంది. స్పష్టమైన, సంక్షిప్తమైన శబ్దాలను ఎల్జీ వీ20 అందించగలదని తెలిపింది. వీ10 స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న రెగ్యులర్ డాక్కు అప్గ్రేడ్గా వీ20 స్మార్ట్ఫోన్ను క్వాడ్ డాక్తో తీసుకురాబోతున్నామని వెల్లడించింది.
మంచి ఆడియో అనుభూతిని వీ20 యూజర్లకు అందించడానికి అధిక ఫర్ఫార్మెన్స్ అనలాగ్, ఆడియో డివైజ్లకు అధిపతైన ఈఎస్ఎస్ టెక్నాలజీతో కలిసి పనిచేసి, ఈ క్వాడ్ డాక్ను అభివృద్ధి చేసినట్టు ఎల్జీ వెల్లడించింది. ఫాస్ట్ ప్రాసెసర్లు, పెద్ద డిస్ప్లేలు మాత్రమే కాక, బెస్ట్ క్వాలిటీ ఆడియోను అందించేందుకు కృషిచేశామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్, మొబైల్ కంపెనీ ప్రెసిడెంట్ జునో చూ తెలిపారు. సెప్టెంబర్ 6న ఈ ఫోన్ను ఎల్జీ ఆవిష్కరించనుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్7 కు పోటీగా ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావాలని ఎల్జీ వ్యూహాలు రచిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more