Telecom stocks pull Sensex down 90 points; Nifty settles below 8510

Sensex washes out early gains dips 90 pts

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Sensex started-off on a strong foot and regained the 28,000-mark to hit a high of 28,013.50. However, on selling in key bluechips it slipped to a low of 27,697.69, before settling 89.84 points or 0.32 per cent lower at 27,746.66.

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. 8509 మార్కు చేరిన నిఫ్టీ

Posted: 07/18/2016 06:37 PM IST
Sensex washes out early gains dips 90 pts

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల బాటలో పయనించాయి. గత వారంతంలో నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు ఇవాళ ఉదయం లాభాలు పలుకరించాయి. అరంభంలో లాభాలతో బలంగా కనబడిన మార్కెట్లు వాటిని అధిమిపట్టుకోలేక పోయాయి. పార్లమెంటు సమావేశాలు, మాన్ సూన్ అంచనాల నేపథ్యంలో పాజిటివ్ నోట్ తో మొదలైన మార్కెట్లు.. ఐటీ, ఆయిల్, గ్యాస్ స్టాక్స్ లో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. దీనికి తోడు టెలికాం రంగ సూచీల త్రైమాసిక ఫలితాల కూడా మార్కెట్లను నష్టాలబాటలో పయనింపజేశాయి.

దీంతో ఉదయం ప్రతిష్టాత్మక 28 వేల మార్కును దాటిన సెన్సెక్స్, తీవ్ర ఒడిదోడుకల మధ్య చివరకు నష్టాలను మూటగట్టుకుంది, దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి మూడు వందల పాయింట్ల కిందకు దిగజారింది, దీంతో సెన్సెక్స్ 90 పాయింట్లను నష్టపోయి 27 వేల 698 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 33 పాయింట్ల నష్టంతో 8 వేల 508 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ్లి ట్రేడింగ్ అటో, ఐటీ రంగాలకు చెందిన సూచీలు స్వల్ప లాభాలను అర్జించగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి.

అయిల్ అండ్ గ్యాస్, కన్జూమర్ డ్యూరబుల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్,  క్యాపిటల్ గూడ్స్ చెందిన సూచీలు భారీ నష్టాలను ఎదుర్కోగా, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, టెక్నాలజీ చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య, మద్యతరహా పరిశ్రమాల సమాఖ్యల సూచీలు కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో బజాజ్ అటో, భారతి ఇన్ ఫ్రా టెల్, టాటా మోటార్స్, యాక్సిక్ బ్యాంక్, ఏషియర్ మోటార్స్ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, ఐడియా సెల్యూలార్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్ టెల్, బ్యాంక్ అప్ బరోడా, జీ ఎంటర్టైన్ మెంట్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles