Confirmed! Reliance Jio 4G commercial launch on August 15

Reliance jio 4g service launch set for august says report

reliance jio, reliance jio 4g, reliance jio 4g launch, reliance jio full launch, how to get reliance sim, reliance jio sim free, reliance jio full service, reliance jio phone, reliance jio plus lyf smartphones, technology, technology news

Reliance Jio Infocomm’s 4G services could launch on August 15, and the first plan will be called Freedom with free voice services bundled with data

స్వతంత్ర దినోత్సవ నుంచే రిలయన్స్ జియో సేవలు ప్రారంభం

Posted: 07/14/2016 07:58 PM IST
Reliance jio 4g service launch set for august says report

రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్స్ 4జీ సేవలు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టులో వీటిని కమర్షియల్ గా ఆవిష్కరించనున్నారని సమాచారం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం కంపెనీ, ఫ్రీడమ్ పేరుతో పిలుచుకునే తన తొలి జియో ప్రణాళిక కింద, డేటాతో కూడిన ఉచిత వాయిస్ సర్వీసులతో పాటు టాప్ ప్రత్యర్థుల కంటే 25శాతం తక్కువ ధరలను వినియోగదారులకు అందించాలని ప్రణాళికలు వేసింది. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టులోనే కమర్షియల్ గా జియో 4జీ సేవలను లాంచ్ చేయబోతుందని ఈ ప్లాన్ కు సంబంధించిన ముగ్గురు అధికారులు వెల్లడించారు.

జియో సేవల ప్లాన్ గురించి ముందుగానే కంపెనీ తన టీమ్ సభ్యులకు సమాచారం అందించింది. ఈ సేవలు డిసెంబర్ లో కమర్షియల్ గా వస్తాయని టీమ్ సభ్యులు భావించారు.ఆరేళ్ల శ్రమ అనంతరం ఈ 4జీ సేవలను రిలయెన్స్ కమర్షియల్ గా లాంచ్ చేయబోతోంది. 2010లో ప్యాన్ ఇండియా 4జీ ఎయిర్ వేవ్స్ ను కొనుగోలుతో కంపెనీ టెలికాం సెక్టార్ లోకి పునఃప్రవేశించింది. ఉచిత వాయిస్ సర్వీసుల ఆఫర్ తో భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ వంటి పోటీ సంస్థలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన రిలయెన్స్ 4జీ జియో సర్వీసులపై దూకుడుగా వెళ్తోంది.

జియో సేవల కింద ఉచిత వాయిస్ ప్లాన్ అందుబాటులో ఉండటంతో పాటు, రూ.80తో 1జీబీ డేటాను జియో సబ్ స్క్రైబర్లు వేపించుకోవాల్సి ఉంటుందని మరో అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆపరేటర్లు 1జీబీ డేటాను రూ.100-120లకు అందిస్తున్నాయి. తమ పోటీదారులకంటే 80శాతం రిలయెన్స్ జియో స్పీడుగా ఉంటుందని ముకేష్ అంబానీ చెప్పిన సంగతి తెలిసిందే. కమర్షియల్ లాంచింగ్ కోసం ముందుగానే తన లైఫ్ ఫోన్ల ధరలను కూడా తగ్గించేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  4G services  Commercial launch  August  independence day  

Other Articles