Sensex closes 106 points lower, Nifty below 8,550; Infosys top loser

Sensex snaps 4 day rally ends 106 points lower on selloff in it stocks

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Sensex snapped 4-day winning streak as blue chip Infosys fell as much 9 per cent after their disappointing results and slashed revenue forecasts. Bigger rival Tata Consultancy Services also fell.

బ్రగ్జిట్ ప్రభావం.. ఇన్ఫోసిస్ ఫలితాలు.. నష్టాల్లో మార్కెట్లు..

Posted: 07/15/2016 05:09 PM IST
Sensex snaps 4 day rally ends 106 points lower on selloff in it stocks

దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇవాళ బ్రెగ్జిట్ ప్రభావం ప్రస్పూటించింది. గత నాలుగు రోజులుగా వస్తున్న వరుస లాభాలకు వారంతంలో బ్రేకులు పడ్డాయి. ఇన్ఫోసిస్ సంస్థ తమ అర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీంతో ఐటీ రంగ షేర్ల అమ్మకాలకు గురయ్యాయి. ఫలితంగా మార్కెట్లు నష్టాపోయాయి. ఇన్పోసిస్ ప్రభావం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో లిమిటెడ్ సంస్థలపై కూడా పడింది. దీంతో ఆయా సంస్థలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఫలితంగా ఐటీ రంగ సూచీలు భారీగా పతనమయ్యాయి.

బ్రెగ్జిట్ ప్రభావాన్ని అధిగమించామన్న అంచానాలు భారతీయ మార్కెట్లపై నెలకోన్నా.. వాస్తవానికి ఇన్ఫోసిస్ సహా పలు ఐటీ సంస్థలపై దాని ప్రభావం పడింది. డాలర్ నెమ్మెదిగా కోలుకోవడం కూడా ఇందుకు కారణంగా అర్థిక నిపుణలు అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ ప్రభావం సాఫ్ వేర్ సంస్థలపై పడిందని, అందుచేత ఐటీ రంగ సూచీల వృద్దిలో మందగమనం సాగుతుందని కూడా వారు అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ తరువాత ఐటీ సంస్థలు వాటి ప్రాజెక్టుల అంచానాల్లోనే భారీ మార్పులు సంభవించాయని అంటున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెస్సెక్స్ 27 వేల 800 మార్కెకు ఎగువన ముగియగా, అటు నిఫ్టీ కూడా ప్రతిష్టాత్మక 8500 మార్కుకు ఎగువన ముగిసింది.  

ఇవాళ్లి ట్రేడింగ్ ఐటీ, టెక్నాలజీకి చెందిన సంస్థల షేర్లు భారీగా పతనం కాగా, వాటి ప్రభావంతో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య, మద్యతరహా పరిశ్రమాల సమాఖ్యలతో పాటు హెల్త్ కేర్ సూచీలు కూడా స్వల్పంగా పతనమై నష్టాలను ఎదుర్కోన్నాయి. అయితే అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఎఫ్ఎంజీసీ, అయిల్ అండ్ గ్యాస్ సూచీలకు చెందిన సంస్థల షేర్లు లభాలలో పయనించాయి. ఈ నేపథ్యంలో టాటా స్టీల్, భారతి ఎయిర్ టెల్, ఐడియా సెల్యూలార్, బాస్చ్, హెచ్ డి ఎప్ సి తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, అరబిందో ఫార్మా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles