syndicate bank adalat in telugu states on june 9th

Sbi mega e auction on 12 june

Bad loans, Commercial property, Online auction, SBI, Loans, Syndicate Bank, Adalat

syndicate bank conducts adalat in telugu states on june 9th for one time settlement of bad loans, whereas sbi goes for e aution on bad loans on 12 june.

రుణాల వసూళ్లకు సిండికేట్ బ్యాంక్ ఆదాలత్.. ఎస్బీఐ ఈ వేలం..

Posted: 06/06/2015 09:15 PM IST
Sbi mega e auction on 12 june

మొండిబకాయిలుగా మారిన నివాస, వాణిజ్య ఆస్తులను జూన్ 12న ఆన్‌లైన్లో వేలం వేయనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 14 తర్వాత ఎస్‌బీఐ ఇలా ఈ-వేలం నిర్వహించడం ఇది రెండోసారి. అప్పట్లో బ్యాంకు రూ. 1,200 కోట్లు విలువ చేసే 300 నివాస, వాణిజ్య ఆస్తులను వేలానికి ఉంచింది. అయితే, కేవలం సుమారు రూ. 100 కోట్లు విలువ చేసే 130 ప్రాపర్టీలను మాత్రమే విక్రయించగలిగింది. వీటిలో ఎక్కువగా నివాస ఆస్తులే ఉన్నాయి. తాజాగా జూన్ 12 నిర్వహించబోయే ఈ-వేలంలో సుమారు 40 నగరాల్లో మొండిబకాయిలుగా మారిన ఆఫీసులు, షాప్‌లు, అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీ బిల్డింగులు మొదలైన వాటిని ఎస్‌బీఐ విక్రయించనుంది. మార్చి క్వార్టర్‌లో ఎస్‌బీఐ స్థూల నిరర్థక ఆస్తులు 4.95 శాతం నుంచి 4.25 శాతం స్థాయికి మెరుగుపడ్డాయి. అలాగే నికర ఎన్‌పీఏలు కూడా 2.57 శాతం నుంచి 2.12 శాతం స్థాయికి తగ్గాయి.
.
అటు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన ఖాతాలను పరిష్కరించుకోవడానికి సిండికేట్ బ్యాంక్ జూన్ తొమ్మిదిన అదాలత్ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని శాఖల్లో ఈ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని, ఒకేసారి చెల్లించడం ద్వారా (వన్‌టైమ్ సెటిలిమెంట్ )ఎన్‌పీఏ ఖాతాలను వదిలించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, వ్యాపార, వ్యక్తిగత, విద్యా, ఉద్యోగ రుణాలున్న ఎన్‌పీఏ ఖాతాదారులు ఈ అదాలత్‌లో పాల్గొని వన్‌టైమ్ సెటిలిమెంట్ కింద వడ్డీ రాయితీని పొందచ్చని బ్యాంకు తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bad loans  Online auction  SBI  Syndicate Bank  Adalat  

Other Articles