Market ends at 2015 lows, Sensex falls 245 pts; HDFC drags

Markets close at lowest level in 2015

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The market continued its southward journey for the fifth consecutive session on Monday, weighed by banking & financials, FMCG, auto and pharma stocks.

2015 ప్రారంభస్థాయికి దిగజారిన స్టాక్ మార్కెట్లు.. పసిడి ధరలు పతనం

Posted: 06/08/2015 07:50 PM IST
Markets close at lowest level in 2015

స్టాక్‌ మార్కెట్ల ఇవాళ కూడా నష్టాల బాటలో పయనించాయి. వారారంభంలో నష్టాలను మూటగట్టుకున్న దేశీయ సూచీలు. వరసగా ఐదో రోజు కూడా పతనం చెంది.. 2015 ప్రారంభం నాటి స్థాయికి చేరింది మరోలా చెప్పాంటే ఆరు మాసాల కనిష్ట స్థాయికి మార్కెట్లు పడిపోయాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, భారత వాతావరణశాఖ ఐఎండీ విడుదల చేసిన వర్షాభావ పరిస్థితులపై అంచనాలతో కుదేలయిన మార్కెట్లు అప్పటి నుంచి వరుస నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే నష్టాల భాటలో పయనించిన దేశీయ సూచీలు.. ప్రారంభంతోనే సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోగా, అటు నిఫ్టీ 8050 పాయింట్లకు దిగువన ట్రేడింగ్ కోనసాగించింది.

అటో, బ్యాకింగ్, ఎఫ్ ఎం జీసీ, ఫార్మ, ఫైనాన్షియల్ సహా, మద్య తరహా, చిన్న తరహా పరిశ్రామిక రంగాల సూచీలతో పాటు అన్ని సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 245 పాయింట్ల నష్టంతో 26 వేల 523 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 8044 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో ఎన్ఎండీసీ, బజాజ్ అటో, టాటా పవర్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్రోరేషన్ సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కాయిర్న్ ఇండియా, వేదాంత, టాటా స్టీల్, బ్యాంక్ అఫ్ బరోడా సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

మరోవైపు అంతర్జాతీయ ధరలు బలహీనంగా ఉండటంతో దేశీయంగా బంగారం ధరలు గతవారం క్షీణించాయి. దీంతో పుత్తడి ధర వరుసగా మూడోవారం కూడా తగ్గినట్లయ్యింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ. 27,000లోపునకు తగ్గింది. 99.9 స్వచ్ఛతగల పుత్తడి రూ. 26,950 వద్దకు, 99.5 స్వచ్ఛతగల బంగారం రూ. 26,800 వద్దకు తగ్గింది. ఈ రెండూ అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 380 మేర తగ్గాయి. దేశీయంగా ఈ ధర 6 వారాల కనిష్టం. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలకు బలం చేకూరడంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,168 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇది 11 వారాల కనిష్టం

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles