Gold Prices Can Crash to Rs 20,500 if US Hikes Rates: Report

Gold prices can crash to rs 20 500

Gold price, silver price, commodities, bullion market, Federal Reserve, US Fed, Gold, Silver, gold and silver, Gold price, futures trade, weak cues from global market

The possibility of a rate hike by the US Federal Reserve remains a big worry for Indian stocks and currency markets, already under pressure amid concerns about weak corporate earnings, sluggish growth and the probability of a deficient monsoon.

అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తే.. భారీగా పడనున్న బంగారం ధరలు

Posted: 06/05/2015 05:06 PM IST
Gold prices can crash to rs 20 500

అంతర్జాతీయ విపణిలో పసిడికి కాంతులకు ప్రమాదం పోంచి వుందా.? మగువల ఆభరణాల కాంతులు సన్నగిల్లనున్నాయా..? బంగారం మదుపరుల పెట్టుబడులు పతనం అంచుకు చేరనున్నాయా..? అంటే అవుననే వార్తలే వినబడుతున్నాయి. ఒక్కసారిగా స్వర్ణం తన వెలుగులను కోల్పోనుంది. అమెరికాలో వడ్డీ రేట్టు పెంచుతూ అక్కడి ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకున్న పక్షంలో బంగారం ధరలు గణనీయంగా పడిపోతాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ వెల్లడించింది. అంతర్జాతీయంగా బంగారం ధరలపై అమెరికా వడ్డీ రేట్లు ప్రభావాన్ని చూపనున్నాయి.

ఇదే జరిగితే భారత్ లో కనీసం పది నుంచి 25 శాతం వరకు ధరలు పడిపోతాయని సదరు సంస్థ వెల్లడించింది. దీంతో భారత్ లో పది గ్రాముల బంగారం ధరలు ప్రస్తుతమున్న 24 వేల నుంచి 20 వేల 500 రూపాయలకు దరలు పడిపోతాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ అంచనా వేసింది. అటు అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1050 డాలర్ల నుంచియ 900 డాలర్లకు తగ్గవచ్చని పేర్కోంది. ఒక వేల వడ్డీ రేట్లు యధాతథంగా కోనసాగించిన క్రమంలో బంగారం ధరల 1300 డాలర్ల నుంచి 1350 డాల్లర వరకు పెరగవచ్చని తెలిపింది. ఇటు భారత్ లోనూ పది గ్రాములు బంగారం ధర 29 వేల 500 రూపాయల నుంచి 30 వేల 500 వరకు చేరుకుంటుందని ిండియా రేటింగ్స్ సంస్థ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold prices  Silver prices  futures trade  weak cues from global market  

Other Articles