Nifty ends expiry below 8350, Yemen woes drag Sensex 654pts

Nifty ends expiry below 8350 yemen woes drag sensex 654pts

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, gold, yellow metal, future trading

The market crashed more than 2 percent on geopolitical tensions and March F&O expiry. The Sensex plunged 654.25 points to close at 27457.58 and the Nifty fell 188.65 points to 8342.15.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 654 పాయింట్ల పతనం..

Posted: 03/26/2015 08:39 PM IST
Nifty ends expiry below 8350 yemen woes drag sensex 654pts

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. సెన్సెక్స్ మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల వాతావరణం పవనాలతో పాటు అసియా ఖండంపై సౌదీ అరేబియా, యోమెన్ ల మధ్య అలుముకున్న యుద్ద వాతావరణం నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. సౌదీ అరేబియా యోమెన్ లోని హోతిలపై ద్రోణ్ దాడులకు పాల్పడిందంత వార్తలతో చమురు ధరలు కూడా పతనం అంచునే సాగాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కట్లలో వున్న పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు మదుపుదారులు పోటీ పడటంతో మార్కెట్లు నష్టలబాటలో నడిచాయి.

ఇవాళ సెన్సెక్స్ 654 పాయింట్లు నష్టపోగా, నిప్టీ కూడా 189 పాయింట్లు నష్టంతో 8350 మార్కు దిగువకు చేరుకుంది. క్యాపిటల్ గూడ్స్ రంగం మినహా అన్ని సెక్టార్లు నష్టాలను చవిచూశాయి. హెల్త్ కేర్, ఐటీ, ఆటో, మెటల్, అయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ ఎం జీ సీ సహా అన్ని సెక్టార్లు అమ్మాకాల ఒత్తడికి లోనయ్యాయి. ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి 654 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 27మ వేల 458 పాయింట్ల వద్దకు క్లోజ్ అవ్వగా, నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 83 43 పాయింట్ల వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో ఐడియా సెట్యూలార్, బిపిసీఎల్, భారతీ ఎయిర్ టెల్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎన్ ఎం డీ సీ, సంస్థల షేర్లు అత్యధిక లాభాలను అర్జించగా, హెచ్ డీ ఎఫ్ సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ , విఫ్రో, సీసీ స్ట్రరైల్, ఎస్ బి ఐ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల మేలిమి బంగారం 26 వేల 697 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 38 వేల 593 రూపాయలుగా ఉంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  gold  

Other Articles