Late sell off drags sensex 152 pts bank nifty down 386 pts

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, gold, yellow metal, future trading

The market shed all its gains in last hour of trade on Thursday, dragged by profit booking in banks, FMCG, auto and capital goods stocks. However, the Sensex had surged over 350 points intraday following a dovish statement from the US Federal Reserve.

ఫెడ్ రిజర్వు ప్రకటనతో.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 03/19/2015 07:17 PM IST
Late sell off drags sensex 152 pts bank nifty down 386 pts

విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల వాతవారణం నేపథ్యంలో వరుసగా రెండో రోజు దేశీయ సూచీలు నష్టాల భాటలో పయనించాయి. చివరి నిమిషంలో యూనైటెడ్ ఫెడ్ రిజర్వు విడుదల చేసిన ప్రకటనతో అప్పటి వరకు లాభాలను ఆర్జించి ముందుకు సాగుతున్న స్టాక్ మార్కెట్ లాభాలన్నీ అవిరయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు బ్యాకింగ్ , ఎఫ్ ఎం జీ సీ, అటో సహా కాపిటల్ గూడ్స్ స్టాక్స్ లో లాభాలను ఆర్జించింది. ఒక దశలో నెస్సెక్సక్ 28 వేల 971 మార్కును దాటగా, నిఫ్టీ 8 వే ల784 పాయింట్లను చేరింది. అగ్రరాజ్యం ఫెడరల్ రిజర్వ్ తమకు ఓపిక లేదని వడ్డీ రేట్లను పెంచక తప్పదని నిర్ణయం తీసుకోవడం.. వాటిని ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లలో తిరోగమనం ప్రారంభమైయ్యింది.

దీంతో ఇవాళ మార్కెట్లు ముగిసే సమాయానికి సెన్సెక్స్ 152 పాయింట్లను నష్టపోయి 28 వేల 470 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 51 పాయింట్లు నష్టాలను చవిచూసి 8 వేల 634 పాయింట్ల వద్ద ముగిసింది. పెడరల్ రిజర్వ్ తమ ఆర్థిక విధానలను ప్రకటించిన నేపథ్యంలో మదుపుదారులు అమ్మకాలకు మొగ్గచూపడంతో.. దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. దీర్ఘకాలిక వినియోగదార వస్తువుల సెక్టార్ సంబంధించిన షేర్లతో పాటు హెల్త్ కేర్ షేర్లు మినహా అన్ని సెక్టార్లు నష్టాలలోనే పయనించాయి. ఈ క్రమంలో లుపిన్, ఏషియన్ షెయింట్స్, గెయిల్, టాటా స్టీల్ , టీసీఎస్ సంస్థల షేర్లు అధిక లాభాలను అర్జించగా, పీఎన్ బి, బ్యాంక్ అఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ , అత్యధిక నష్టాలను మూటకట్టుకున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  gold  

Other Articles