Xiaomi set for mi4 flash sale in india on 24 february

Xiaomi set for Mi4 flash sale, India, Xiaomi Mi4 flash sale in India, Xiaomi mi4 sales in e commerce, Xiaomi mi4 16GB, 64GB Models for sale, oneplus, oneplus one, Smartphones, smartphones in india, Xiaomi, Xiaomi in India, Xiaomi Mi4, indian market,

Xiaomi Mi4 Flipkart Flash Sale to Go Live on 24 February; 16GB, 64GB Models Up for Grabs

షియోమీ Mi4 నుంచి మరో రెండు సరికొత్త మోడళ్లు..

Posted: 02/24/2015 05:52 PM IST
Xiaomi set for mi4 flash sale in india on 24 february

భారతీయ విఫణితో తన సత్తాను చాటుకుంటూ ముందుకెళ్తున్న షియోమి మరో రెండు సరికోత్త స్మార్ట్ ఫోన్లతో కస్టమర్ల ముందుక రానుంది. షియోమీ ఇటీవల ప్రవేశపెట్టిన ఎంఐ4 ఫోన్లలో మరో రెండు సరికోత్త మోడళ్లను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇంతకుముందు ఎంఐ3, రెడ్ ఎంఐ1ఎస్ ఫోన్లతో సామాన్యులకు స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. తాజాగా 16 జీబీ, 64 జీబీ వేరియంట్లతో కూడిన ఎంఐ4 స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఈసారి కూడా ఫ్లిప్కార్ట్లోనే.. అదీ మంగళవారమే రెండు వేర్వేరు ఫ్లాష్ సేల్స్లో వీటిని విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్లను బుక్ చేసుకునేందుకు ఇవాళ అర్థరాత్రి వరకే సమయం వుంది. అర్ధరాత్రితో రెండు వేరియంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు ముగియనుంది. 16 జీబీ వేరియంట్ ధరను రూ. 19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ. 23,999 గాను నిర్ణయించారు.

16 జీబీ వేరియంట్ మొత్తం 25వేల యూనిట్లు పెట్టగా 15 సెకండ్లలోనే అమ్ముడయ్యాయి. ఇంతకుముందు పర్చేజ్ ఆప్షన్ క్లిక్ చేసి, మనకు ఫోన్ వచ్చిందనుకున్న తర్వాత 4 గంటల్లోగా చెల్లింపు పూర్తి చేయాల్సి ఉండేది. ఇప్పుడా సమయాన్ని అరగంటకు కుదించారు. షియోమి ఎంఐ 4 ఫోన్ ఆండ్రాయిడ్ 4.4 కిట్క్యాట్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్ ఉంది. దీని వేగం 2.5గిగా హెర్ట్జ్లు. ఫోన్లో ర్యామ్ 3 జీబీ ఇచ్చారు. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని బ్యాటరీ సామర్థ్యం 3080 ఎంఏహెచ్. దీనితో పాటు క్విక్ చార్జ్ అఫ్షన్ కూడా వుందని సంస్థ వర్గాలు తెలిపాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : xiaomi corporation  mi4 phone  smart phones  

Other Articles