Rbi keeps interest rates on hold

RBI, Interest Rates on Hold, RBI Monetary Policy, money, rbi, monetary policy, Reserve Bank of India (RBI), repo rate, reverse repo rate, interest rate, CRR, slr, RBI policy meet, RBI governer, raghuram rajan,

The Reserve Bank of India (RBI) today kept the repo rate or interest rate steady in its policy meet after having cut interest rates by 0.25 per cent or 25 basis points last month.

కీలక వడ్డీ రేట్లు యథాతథం.. అదుపులోనే ద్రవ్యోల్భణం

Posted: 02/03/2015 03:37 PM IST
Rbi keeps interest rates on hold

గత నెలలో తగ్గిన వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని ఆశించిన సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ నిర్ణయం నిరాశకు గురిచేసింది. మంగళవారం అర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అధ్యక్షతన సమావేశమైన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది. ఈ సమావేశంలో ఆర్‌బీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యాధాతథంగా ఉంచింది.

ఫిబ్రవరి నెలకు జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతానికి తగ్గించడం జరిగింది. ఎస్‌ఎల్‌ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లను తగ్గించారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘరాం రాజన్ మాట్లాడుతూ కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే దఫాలో జరిగే సమావేశంలో అప్పటి పరిస్థితులకు అనుగూణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులోనే ఉందని రాజన్ అన్నారు. వాణిజ్య రంగం, పెట్టుబడుల్లో వృద్ధి కనిపిస్తోందని అన్నారు. ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే బడ్జెట్, ద్రవ్య పరపతి విధానంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రతి ద్రవ్యోల్బనం కూడా అంతగా కనిపించడం లేదని చెప్పారు. ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతానికి తగ్గించామని అన్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లను తగ్గించినట్లు పేర్కొన్నారు. కీలక వడ్డీరేట్లు, సీఆర్‌ఆర్, రెపోరేటు యథాతథంగా ఉంచినట్లు ఆర్‌బీఐ స్పష్టం ఉంచామని పేర్కొన్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : money  rbi  monetary policy  

Other Articles